Wednesday , July 24 2024

షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహ విద్యార్థిని ఆత్మహత్య

తెలంగాణ కెరటం ఆర్మూర్ జూన్ 19:


ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహంలో నిన్న సాయంత్రం గోలి మౌనిక అనే విద్యార్థిని ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. గోలి మౌనిక మెండోరా గ్రామానికి చెందిన వాస్తవ్యురాలు నరేంద్ర మహిళా కళాశాలలో చదువుకుంటూ ఆర్మూర్ పట్టణంలో గల షెడ్యూల్ కులాల మహిళా వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న తరుణంలో నిన్న సాయంత్రం భోజన సమయ ప్రాంతంలో విద్యార్థులతో కలిసి భోజనాన్ని తీసుకొని తన రూములోకి వెళ్లి గడియ వేసుకోవడంతో ఎంతకీ తీయకపోగా హాస్టల్ విద్యార్థులు ,సిబ్బంది అప్రమత్తమై గది యొక్క తలుపులు బద్దలు కొట్టి చూడగా అమ్మాయి ఉరివేసుకొని కనబడింది .వెంటనే హాస్టల్ సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకురాగా అప్పటికె మరణించినది అని ధ్రువీకరించడం జరిగింది. మృతికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు.