Monday , July 22 2024

భక్తుల నగలు బంగారం చోరి

మాకు సంబంధం లేందంటున్న లాడ్జి నిర్వాహకులు

నిర్వాహకులపై అనుమానం వ్యక్తం చేస్తున్న భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి సెప్టెంబర్:-05

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి దర్శనానికి ఆదివారం రోజున వచ్చిన వరంగల్ జిల్లా నర్సంపేట గ్రామానికి చెందిన భక్తులు రామందీర్ వీధిలో గల ధరణి లాడ్జి లో గది అద్దెకు తీసుకొన్నారు మంగళవారం బద్దిపోచమ్మ మొక్కులు
చెల్లించుకొని తిరిగి వచ్చి చూడగ వారి గది తాళం తీసి సామానులు లగేజ్ సంచులు చిందరపడేసి

వాటినుంచి అర తులం బంగారం రెండు రెడీమీ నోట్ 9ప్రో మొబైల్ ఫోన్ లు సుమారు ఇరవై వేల రూపాయలు చోరికి గురైనట్టు గ్రహించి పోలీసు లకు సమాచారం అందించారు భక్తులు లాడ్జి నిర్వాహకులను సంప్రదించగా మాకు సంబంధం లేదని సమాదానం చెప్పారని భక్తులు వాపోయారు అట్టి భక్తులు లాడ్జి నిర్వాహకుల పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు

కరువైన నిఘా

అట్టి లాడ్జి లో సుమారు 50 రూములకు గాను కేవలం మూడు సీసీ కెమరా లు మాత్రమే ఉన్నాయి అవి కూడా పని చేయలేని స్థితి లో ఉన్నాయి

పార్కింగ్ సౌకర్యం లేదు

ఈ లాడ్జి లలో విడిది చేయు భక్తులు పార్కింగ్ స్థలం లేకపోవడం తో రోడ్డు పై నిలిపి వేయడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు