Friday , November 15 2024

మిత్రుడి కుటుంబానికి అండగా ఉంటాం.

తెలంగాణ కెరటం బచ్చన్నపేట ప్రతినిధి ఫిబ్రవరి 18:

బచ్చన్నపేటలో ఎస్ఎస్సి మిలీనియం బ్యాచ్ సహాయనిధి తరఫున గత కొంత కాలం క్రితం బ్యాచ్ మిత్రుడు బసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బాలగోని పరశురాములు మరణించగా వారి కుటుంబానికి అండగా నిలవాలని గతంలో స్నేహితులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న శాశ్వత సహయనిధి నుండి పరశురాములు కూతురు పవిత్ర పేరు మీద 50 వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
రాబోయే రోజుల్లో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటామని అధ్యక్షుడు వెంకటేష్ తెలిపారుఈ కార్యక్రమంలో సహాయనిది కమిటీ అధ్యక్షులు మడూరి వెంకటేష్,ప్రధాన కార్యదర్శి నీల కుమారస్వామి, కోశాధికారి బొమ్మన శ్రీనివాస్,బ్యాంకు వ్యవహారాల ఇంచార్జ్ వేముల గణేష్, ఉపాద్యక్షుడు కొత్త శ్రీనివాస్,కార్యదర్శులు కుడికాల సతీష్ ,బుర్ర శ్రీనివాస్, రావుల ఉపేందర్, బొమ్మేన ప్రసాద్ తదితర మిత్రులు పాల్గొనడం జరిగింది.