Wednesday , September 18 2024

చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి
తెలంగాణ కెరటం,బచ్చన్నపేటప్రతినిది, మే 4 :లోక్సభ ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ దోపిడీ విధానాలకు పరాకాష్టగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలి నమ్మడం లేదని చెప్పారు. ప్రజాస్వామిక విధానాలను అమలు చేసే కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించి స్థిరమైన పరిపాలనకు మద్దతుగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ పధకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుండి పులువురు నాయకులు డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.చామల కిరణ్కుమార్ రెడ్డి గెలుపుకు బచ్చన్నపేట మండలంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చామల కిరణ్ కుమార్ రెడ్డి తరపున ప్రచారం చేస్తు గెలుపుకు కృషి చేస్తున్నారు అని తెలిపారు