ప్రజలకు అభివృద్ధి చేయాలని బికేఆర్ ఫౌండేషన్ స్థాపించాను,
ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డి,
తెలంగాణ కెరటం మక్తల్ ప్రతినిధి,
మక్తల్ నియోజకవర్గం సంగంబాడ గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగంలో ఒక వెలుగు వెలుగుతూ తన రియల్ ఎస్టేట్ రంగంలో 30 వేల మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి మక్తల్ లో తన సహచరులతో కలిసి బి కే ఆర్ ఫౌండేషన్ స్థాపించారు, వారి సంస్థల పని చేసే వారికి కరోనా మొహమారి సమయంలో లక్షలాది రూపాయలు వేచించి స్వయంగా వారికి వైద్యాన్ని అందించారు, నూతనంగా మక్తల్ నియోజకవర్గంలో బి, కే, ఆర్, ఫౌండేషన్ ను స్థాపించ డం జరిగింది, దీని ద్వారా ఆగస్టు మూడవ తేదీ ద్వారకా ఫంక్షన్ హాల్ నందు ఈ నియోజకవర్గంలో ఉండే పేద మహిళలకు ప్రతి గ్రామం నుంచి కొందరిని ఎంపిక చేసి దాదాపు 1000 మందికి ఐదు మండలాలలో కుట్టుమిషన్లను పంపిణీ చేయనున్నట్లు విలేకరుల సమావేశం నిర్వహించి వారు తెలిపారు, సమావేశంలో మాట్లాడుతూ తను పుట్టిన గ్రామానికి మండలానికి నియోజకవర్గాని అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో బి కే ఆర్ ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని దీని యొక్క ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాలకు పేదలకు మధ్యతరగతి వారికి విద్య వైద్యం అందించాలని దృఢ సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ ఫౌండేషన్ రాజకీయ పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా సేవ చేయడం కొరకు దీనిని స్థాపించడం జరిగిందని వారు అన్నారు, ఆగస్టు మూడవ తేదీ వెయ్యి మందికి కుట్టు మిషన్లు అందించి ఫౌండేషన్ కార్యక్రమాలకు ప్రారంభం నకు శ్రీకారం చుడుతున్నామని అత్యధికంగా ప్రజలు ద్వారకా ఫంక్షన్ హాల్ లో జరిగే ఈ ఫౌండేషన్ కార్యక్రమానికి రావాల్సిందిగా అందరికీ ఆహ్వానం పలకడం జరుగుతుందని అన్నారు, ఇట్టి కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి లక్ష్మారెడ్డి మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్ నీలప్ప ముదిరాజ్ మాజీ సర్పంచ్ సూర్యనారాయణ గుప్త మాజీ సర్పంచ్ గడ్డంపల్లి హనుమంతు గణేష్ కుమార్ మాజీ ఎంపిటిసి చందాపూర్ రాములు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు,