Monday , July 22 2024

ఆటో ని డి కొట్టిన టాటా ఏసీ ఒకరు మృతి

చందుర్తి ఆరోగ్య కేంద్రంలో కరువైన సౌకర్యాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి జూలై:-5

రాజన్న సిరిసిల్ల జిల్లా
చందుర్తి మండల కేంద్రంలోని వేములవాడ కోరుట్ల ప్రధాన రహదారి పై మంగళవారం
మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం లో మహిళ మృతి చెందింది వేములవాడ నుండి కోరుట్ల కు చెందిన వారు వేములవాడ నుండి ఆటో లో కోరుట్ల కు వెలుచుండగా వెనుకనుండి వచ్చిన టాటా ఏసీ వాహనం డీకొట్టడం తో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ
కింద పడి ఆపాస్మారక స్థితి లోకి వెళ్లడం తో చందుర్తి ప్రాథమిక ఆసుపత్రి కి తరలించారు పరిస్థితి విషమించడం తో వేములవాడ ఏరియా ఆసుపత్రి కి తరలించారు అప్పటికే శృతి(15) మృతి చెందడం తో పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహన్ని సిరిసిల్ల ఆసుపత్రి కి తరలించారు చందుర్తి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సరైన పరికరాలు లేక వేములవాడ ఏరియా హాస్పిటల్ కి తరలించారు స్థానిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన పరికరాలు ఉంటే ఆ మహిళ బ్రతికేదేమో అని స్థానికులు చర్చించుకుంటున్నారు.