Tuesday , July 16 2024

తగ్గేదే లే!

చుక్కల్లో చికెన్ ధరలు

ఆదివారం వస్తె ముక్క లేకపోతే ముద్ద దిగదు

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి ( కౌటాల) : ఫిబ్రవరి 25

కౌటాల: చికెన్ ధర చూస్తే కెవ్వు మనాల్సిందే. అంతకంతకూ ధర కొండెక్కుతుంది. చికెన్ రేటు అమాంతం పెరగడం తో మాంసహార ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు చికెన్ తినాలంటే ఒక్కసారి పర్సు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ వైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, మరోవైపు కోళ్ల సరఫరా తగ్గడంతో ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి.దీంతో చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. కోడి ధరలు చూసి సామన్యుడు బెంబేలెత్తి పోతున్నాడు. ఒక్కరోజులోనే చికెన్ ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి.బుధ, గురు వారాల్లో రూ.150 నుంచి 200 ఉన్న కిలో లైవ్ కోడి.. శనివారం, ఆదివారం అమాంతం పెరిగిపోయింది.కోళ్ల సరఫరా తగ్గడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. వినియోగదారుల అవసరం మేరకు ఉత్పత్తి లేకపోవడంతో కోడి మాంసం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో మాంసహార ప్రియులు గగ్గోలుపెడుతున్నారు.ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.300పైనే ఉంది. బోన్ లెస్ చికెన్ రికార్డు స్థాయిలో కిలోకు రూ.500 కు పైగా అమ్ముతున్నారు. ఓవైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, మరోవైపు ఎండతీవ్రత ఎక్కువైతే చికెన్ ధరలు మరింత పెరుగు తాయని వ్యాపారులు చెబుతు న్నారు.ఆదివారం వస్తే చాలు పట్టణ వాసులకు ముక్కలేకపోతే ముద్ద దిగదు. ఆదివారం సుమారు కొన్ని వేల కిలోల వరకు చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి.తాజాగా ధరల పెరుగు దలతో విక్రయాలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.