తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : మార్చ్ 01
దహేగాం ,పెంచికల పెట్ మండలా లలో శుక్రవారం స్వేరో నేషనల్ జాతీయ అధ్యక్షుడు సుప్రీం స్వెరో డాక్టర్ అర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు డి సురేష్ అధ్యారంలో దహే గాం ,పెంచికలపెట్ మండల నూతన స్వేరో మండల కమిటీ ఎన్నిక ఎకిగ్రీవంగా ఎన్నుకున్నారు.దాహేగాం మండల అధ్యక్షుడు గా గొర్లపల్లి ఆనంద్ రావ్,జనరల్ సెక్రటరీ దుర్గం గౌతం,పెంచికాల్ పెట్ మండల అధ్యక్షుడు భక్తు నగేష్,జనరల్ సెక్రటరీ పగిడి బాబులాల్ తదితరులను
ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ దశరథ్ , జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ కుమ్మరి శ్రీనివాస్ ,జిల్లా సోషల్ మీడియా దుర్గం విజయ్ కుమార్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ జాడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.