Monday , September 16 2024

బెంగాళీ నామశూద్రులకు ఎస్సీ హోదా ఇవ్వండి:

_ జాతీయ ఎస్సీ కమీషన్ డైరెక్టర్ కు వినతి

__ బిఎస్పి రాష్ట్ర చీఫ్ డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి ( కౌటాల) : ఫీ రవరి 28

బెంగాళీ నుంచి వలస వచ్చి స్థిరపడిన నామ శూద్రులను ఎస్సీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ జాతీయ ఎస్సీ కమీషన్ డైరెక్టర్ ను కోరారు. బీఎస్పీ ఆధ్వర్యంలో బుధవారం పలువురు బెంగాళీలతో కలిసి హైదరాబాద్ లోని జాతీయ ఎస్సీ కమీషన్ ప్రాంతీయ కార్యాలయం  డైరెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 1971లో బంగ్లాదేశ్ నుండి బెంగాళీలు శరణార్థులుగా వచ్చి కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని స్థిరపడిన వేలాది మంది నామశూద్ర కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కొరారు.దేశంలోని చాలా రాష్ట్రాల్లో నామశూద్రులను ఎస్సీలుగా గుర్తించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా నామ శూద్రులను ఎస్సీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ ను కోరారు. సుదీర్ఘకాలంగా బెంగాలీలు ఎస్సీ హోదా కోసం పోరాడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చండాల కులస్తులనే నామశూద్రులుగా పిలుస్తున్నారని అన్నారు. గతంలో వీరికి ఎస్సీ కులంగా పరిగణించి ఎస్సీ హోదాలో రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా నామ శూద్రులను ఎస్సీల్లో చెర్చేలా కమీషన్ చర్యలు తీసుకోవాలని కోరారు.