Monday , July 22 2024

జిల్లాలో జాబ్ మేళాకు విశేష స్పందన

3000 మందికి 807 మంది సెలెక్ట్

జీవితంలో ఏ ఉద్యోగం చేసిన క్రమశిక్షణ ముఖ్యం

జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి ( కౌటాల) : ఫిబ్రవరి 26

జిల్లా ఎస్పీ కె.సురేష్ కుమార్ ఐపిఎస్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ పట్టణంలోని టాటియ గార్డెన్స్ నందు ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన సుమారు (50) బహుళ జాతీయ కంపెనీలు పాల్గొన్నాయి. పదవ తరగతి, ఇంటర్మీడియేట్ , పాలిటెక్నీక్ మరియు ఏదైనా డిగ్రీ, పిజి., యం.బి.ఏ, యం.సి.ఏ, బి.టెక్, యం.టెక్, ఫార్మసీ, పూర్తిచేసిన యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని యువతకు మెరుగైన జీవితం కల్పించాలని ఉద్దేశంతో ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. జిల్లాలో చదువుకున్న ప్రతి వ్యక్తి నిరుద్యోగిగా మిగలకూడదు అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
జీవితంలో ఏ పని లేదా ఉద్యోగం చేసిన క్రమశిక్షణ కలిగి ఉండడం ముఖ్యమని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి లక్షణాలను కలిగి ఉండాలని అన్నారు. ఎంత పెద్ద స్థాయికి చేరిన వ్యక్తి అయినా కూడా మొదట ఎన్నో కష్టాలను అనుభవించి తన పనిలో లేదా ఉద్యోగంలో అనుభవాన్ని పొంది, గొప్ప స్థాయికి చేరిన వారేనని అన్నారు. జీవితం ఉన్నతంగా ఉండడానికి స్కిల్స్ నేర్చుకోవాలని, అందరూ తమ తమ నైపుణ్యాలను మెగుపరచుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ మెగా జాబ్ మేళా నందు 3000 మంది అప్లై చేసుకోగా, 807 మంది సెలెక్ట్ అయినట్లు తెలిపారు. అనంతరం వివిధ కంపెనీలలో ఉద్యోగం పొందిన వారికి జాయినింగ్ లెటర్స్, జ్ఞాపికలు అందించారు.
ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ డిఎస్పీ కరుణాకర్, ఆసిఫాబాద్ డిఎస్పి సదయ్య, ఆసిఫాబాద్ సిఐ సతీష్, టాస్క్ ఫోర్స్ మరియు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ రమేష్, ఇతర సిఐలు శ్రీనివాస్ నాగరాజు ,చిట్టిబాబు ,సాదిక్ పాషా , శంకరయ్య, ఆర్.ఐ లు పెద్దన్న, అంజన్న, కిరణ్ కుమార్ , ఎస్సైలు, ఆర్.ఎస్.ఐ లు ఇతర పోలీస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.