Monday , September 16 2024

111 డాక్టరేట్ల డాక్టర్…

అత్యంత ప్రతిభాశాలి సాగి సత్యనారాయణ.

గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో నాలుగుసార్లు చోటు.

ఆస్కార్ ఇన్ ఎక్సెలెన్సీ దక్కించుకున్న ఘనాపాఠి.

2016 జనవరి 28న తొలి గిన్నిస్ రికార్డు.

నంది అవార్డు అందజేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి ( కౌటాల ) : మే 03

హైదారాబాద్ : స్వల్ప వ్యవధిలో అనేక గ్రంధాలు రాసిన జ్ఞానయోగి వివిధ అంశాలకు సంబంధించి డాక్టర్ సాగి సత్యనారాయణ ప్రతిభా పాఠవాలకు అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ గుర్తింపు లభించింది. భారత ప్రతిభా రత్న అంటూ ఆస్కార్ సంస్థ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించింది. వివిధ అంశాలపై ఆయన రాసిన పుస్తకాల పేర్లను ప్రస్తావిస్తూ 2020. డిసెంబర్ 25న ఆస్ట్రేలియాలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రకటించింది. ఈ మేరకు ఆస్కార్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ డైరెక్టర్ గావ్లీ ఓ పత్రం పంపారు.

మల్కాజ్‌గిరి నివాసి డాక్టర్ సాగి సత్యనారాయణ వైద్యుడి గా కొనసాగుతూనే మూడు దశాబ్దాల కాలంలో ఆధ్యాత్మికం వైద్యం, జ్యోతిష్యం,యోగ తదితర అంశాలపై తెలుగు ఆంగ్ల భాషల్లో 180 పుస్తకాలు రచించారు. వీటిద్వారా ఇప్పటివరకు నాలుగు గిన్నిస్ రికార్డులను దక్కించుకున్నారు. తొలి గిన్నిస్ రికార్డును 2016 జనవరి 28న అందుకోగా రెండోది అదే ఏడాది ఆగస్టులో వచ్చింది. మూడో గిన్నిస్ రికార్డును 2019 అక్టోబర్ 3వ తేదీన దక్కించుకున్నారు. 2022 ఆగస్టు 22న నాలుగో సారి గిన్నిస్‌ వరల్డ్ రికార్డును సాధించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాల యాలనుంచి అత్యధికంగా111 డాక్టరేట్లను పొందారు. ఇందులో డాక్టర్ ఆఫ్ సైన్స్ 15… డాక్టర్ ఆఫ్ లిటరేచర్లు 25 తోపాటు 71 డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలను దక్కించు కున్నారు. ఇదంతా కేవలం 41 ఏళ్ల వ్యవధిలోనే సాధించారు. ఇప్పటి వరకు అత్యధికంగా 180 గ్రంధాలను రచించారు. ప్రపంచంలోనే అత్యధిక డాక్టరేట్లను సాధించిన గొప్ప వ్యక్తిగా నిలిచారు.

1980-2021 మధ్య కాలంలోనే ఇదంతా పూర్తయింది. ప్రస్తుతం రెండు విశ్వవిద్యాలయాలకు ఉప కులపతిగా వ్యవ హరిస్తున్నారు. అందులో ఒకటి గుజరాత్ కేంద్రంగా పనిచేసే మహర్షి వేదవ్యాస ఇంటర్నేషనల్ వేదిక్ విశ్వవిద్యాలయం. 2020 ఫిబ్రవరి 15వ తేదీన డాక్టర్ సాగిని ఈ విశ్వవిద్యాయం ఉపకులపతిగా నియమించింది. గుజరాత్ లోని మైక్రోబయాలజీ విశ్వవిద్యాల యానికి కూడా ఆయన వైస్‌ చాన్సలర్‌ గా పనిచేస్తున్నారు.2020-21 సంవత్సరానికిగాను తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుతో సత్కరించింది.

డాక్టర్ సాగి సత్యనారాయణ ప్రతిభాపాఠవాలకు గుర్తింపు లభిస్తూనే ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ కేంద్రంగా పనిచేస్తున్న మా భువనేశ్వరి విశ్వ విద్యాలయం ఈ డాక్టర్‌కి మరో డాక్టరేట్‌ ఇచ్చి సత్కరించింది. అలాగే తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేదిక్ విశ్వవిద్యాలయం ఇంకో డాక్టరేట్‌, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వేదిక్ హిందూ విశ్వవిద్యాలయం మరో డాక్టరేట్‌ను అందజేశాయి. వైద్యుడిగా కొనసాగుతున్న ఈ డాక్టరేట్ల డాక్టర్‌ను ఈ సందర్భంగా సన్మానించాయి.