Tuesday , July 16 2024

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…

సెయింట్ జోసఫ్స్ హై స్కూల్ లో కలిసి చదువుకున్న విద్యార్థులు 20 సంవత్సరాల తరువాత ఆదివారం ఒకచోట కలుసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : ఏప్రిల్ 28

కౌటాల మండలంలోని విజయనగరం జెయింట్ జోసెఫ్స్ ఉన్నత పాఠశాల 2004-2005 సంవత్సరం విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి ప్రధానోపాద్యాయులు ఫాదర్ జేమ్స్ తో అప్పటి ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. విద్యార్థులు మాట్లాడుతు అప్పటి ఉపాధ్యాయులు నేర్పిన విద్యా బుద్దుల వల్లనే నేడు మేమంతా ఈ రోజు ఉన్నత స్థానాలలో ఉన్నామన్నారు. మేము నేర్చిన ప్రతి అక్షరం నేర్పిన గురువులు ఎంతో గొప్పవారన్నారు. విత్తనం నాటిన తరువాత మొలకను ఎలా మలిస్తే అలా మారుతుందో మమ్మలను కూడా మంచి మార్గంలో నడిపించేందుకు చదువు, సంస్కారం, క్రీడలు, సంస్కృతిక కార్యక్రమాలను నేర్పిన గురువుల గురించి ఎం చెప్పన తక్కువే అన్నారు. మేమంతా ఏ స్థానం ఉన్న మా పాఠశాల, గురువులను మరవమన్నారు. 20 సంవత్సరాల తరువాత ఇప్పుడు ఇదే పాఠశాలలో కలవడం ఎంతో గర్వంగా ఉందని, వారిలోని భావోద్వేగాన్ని తెలియచేసారు. ఈ సమ్మేళనంలో ఫాదర్ సిజో, షాదర్ టోం. అప్పటి వైస్ ప్రిన్సిపాల్ ఆలీస్, ఉపాద్యాయులు మారయ్య, ఇందిరాదేవి, వెరోనిక, టి శ్రీనివాస్, జి శ్రీనివాస్, సురేష్, ఘన్శ్యాం, నాగేష్, ఎస్ శ్రీనివాస్, నానాజీ, విద్యార్థులు పాల్గొన్నారు.