Tuesday , July 16 2024

పీడీఎస్ బియ్యం పట్టివేత

— 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి ( కౌటాల ) : 15 ఏప్రిల్

 నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఇతరుల దగ్గర తక్కువ రేటుకు కొని మహారాష్ట్ర కు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే…

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కే. సురేష్ కుమార్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన పక్కా సమాచారం మేరకు పెంచికల్పేట్ మండలం లోని వివిధ గ్రామాల నుండి మహారాష్ట్ర కి పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు అన్న సమాచారం మేరకు ఈ రోజు టాస్క్ ఫోర్స్ పోలీసులు పెంచికల్పేట్ పోలీస్ స్టేషన్ ఏరియా, ఎల్లూరు గ్రామం లో తణిఖీలు చేపట్టారు. ఎల్లూరు గ్రామం లోని ఎండి.ముబాషీర్ ఇంట్లో తనిఖీ చేపట్టగా అతని ఇంట్లో అక్రమంగా తరలించుటకు సిద్దంగా ఉన్న 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యo ను పట్టుకొని పెంచికల్పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించి ఒకరిపై కేసు నమోదు చేసినట్ల్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు.
ఈ టాస్కులో టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది పీసీ మధు,రమేష్, సంజీవ్ పాల్గొన్నారు.