Saturday , October 12 2024

బిల్లు రాలేదని స్కూల్ గేటుకు తాళం

— బడి ముందు విద్యార్థులు పడిగాపులు

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : ఏప్రిల్ 15

కాగజ్ నగర్ : తను చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని స్కూల్ గేట్ కు ఓ కాంట్రాక్టర్ తాళం వేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం పెట్రోల్ పంపు ఏరియాలోని జడ్పీహెచ్ ఎస్ స్కూల్ లో మన ఊరు మన బడి కింద స్కూల్ బిల్డింగ్ ను రూ. 97 లక్షలతో కాంట్రాక్టర్ అబీబ్ నిర్మించాడు. అయితే ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు తనకు రావాల్సిన బిల్లులను అధికారులు శాంక్షన్ చేయలేదు. దీంతో సోమవారం ఉదయం స్కూల్ కు వచ్చిన కాంట్రాక్టర్ అబీబ్ గేట్ కు తాళం వేశాడు. స్కూల్ లో 292 మంది విద్యార్థులు చదువుకుం టున్నారు. సోమవారం నుంచి ఫైనల్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులు స్కూల్ ముందు పడిగాపులు కాశారు. గంట పాటు వేచి చూశారు. విషయం తెలుసుకున్న మన ఊరు మన బడి ప్రత్యేకాధికారి స్పందించి బిల్లులు రాష్ట్ర ఆఫీస్కు పంపామని, మూడు రోజుల్లో బిల్లు వచ్చేలా చూస్తా మని చెప్పడంతో కాంట్రాక్టర్ తాళం తీశాడు.