Saturday , October 12 2024

మహంకాళీ జాతర పోస్టర్ల ఆవిష్కరణ…

— ఈ నెల 23 నుండి 25 వరకు

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిది ( కౌటాల ) : ఏప్రిల్ 10

రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థానంలో ఈ నెల ఏప్రిల్ 23 మంగళవారం నుండి 25 గురువారం వరకు జాతర నిర్వహించబడును, దానికి సంబంధించిన గోడ పోస్టర్లను ఆలయ అర్చకులు దేవార వినోద్, ఆలయ అద్యక్షుడు మోడెమ్ తిరుపతి గౌడ్ గ్రామస్తులు ఆవిష్క రించారు.
ఆలయ ప్రధాన అర్చకులు దేవార వినోద్ మాట్లాడుతూ ఏప్రిల్ 23 వ తేదీ మంగళవారం రోజున శివ పార్వతుల కళ్యాణం, 24 వ తేదీన అమ్మవారికి మొక్కులు, బోనాలు, నిర్వహించి మేకలు, కోళ్లు కోసుకోవడం, సాయంత్రం 04:00 రథోత్సవం, ఉంటుంది అని తెలియజేశారు. ఈ కార్య క్రమంలో గ్రామస్తులు గొట్ల సురేష్, రవి, బాలకృష్ణ, మహేందర్, రాజు, లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.