Thursday , May 23 2024

ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలి

— మాలి సంఘం జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ గుర్లె శ్రీనివాస్

జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలను తెలంగాణ లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలి

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : ఏప్రిల్ 10

చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామంలో మాలి సంఘం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పేరును మహాత్మ
జ్యోతిబాఫూలే ప్రజాభవన్గా మారుస్తున్నట్లు ప్రకటించడం హర్షించదగ్గ విషయమని మాలి సంఘం జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ గుర్లే శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సదర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మాలి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఫూలే దంపతులు చేసిన సేవలు చిరస్మరణీయమని వారు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రగతిభవను కు జ్యోతిరావు ఫూలే నామకరణం చేయడంతో సార్థకత చేకూరిందని పేర్కొన్నారు. అదే విధంగా ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
అలాగే మాలీలకు ఎస్టీహోదా కల్పించి సామాజిక న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.