Wednesday , July 24 2024

మెగా జాబ్ మేళా …

నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోగలరు – జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపిఎస్

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : ఫిబ్రవరి 25

జిల్లా ఎస్పీ కె.సురేష్ కుమార్ ఐపిఎస్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు మెగా జాబ్ మేళా కార్యక్రమం తేదీ 26.02.2024 సోమవారం ఉ.10.00 గంటల నుండి సా.6.00 గంటల వరకు నిర్వహించబడును. ఈ జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన సుమారు (50) బహుళ జాతీయ కంపెనీలు, మన ఆసిఫాబాద్ కు తేదీ 26.02.2024 న రానున్నాయి. కావున, 10th క్లాస్, ఇంటర్మీడియేట్ , పాలిటెక్నీక్ మరియు ఏదైనా డిగ్రీ, పి.జి., యం.బి.ఏ. యం.సి.ఏ. బి.టెక్, యం.టెక్, ఫార్మసీ, పూర్తిచేసిన యువతియువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఈ సదవకాశాన్ని సద్వినియోగ చేసుకోగలరని జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ తెలిపారు. మీ పేరు మీ బయోడేటా వివరాలు తెలిపే సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ మరియు జిరాక్స్ కాపీస్ ని వెంట తీసుకురాగలరనీ తెలిపారు.

జిల్లా పోలీస్ కార్యాలయం – కొమురం భీమ్ ఆసిఫాబాద్