Tuesday , July 16 2024

ఆ పార్టీల అభ్యర్థులకు ఓటు వేయకండి

ఒకరు దొర ఇంకొకరు దొరకరు

మీ ఆట ముగిసింది కాంగ్రెస్ ఆట మొదలైంది…..

త్యాగాల కుటుంబం ఇందిరమ్మ కుటుంబం….

ప్రజా పాలనను ఆశీర్వదించండి ,: జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క

మహిళలకు ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

పదవులు అడగలే పనులు అడిగిన ప్రజాసేవలో ఉంటా కోనేరు కోనప్ప………

ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణక్క ప్రచార సభలో జిల్లా మంత్రి దనసరి సీతక్క ….

సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన Bsp రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ జెడ్పి చైర్మన్ సీడం గణపతి

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : మార్చ్ 31

కౌటాల మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆదివారం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనదరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా రాష్ట్ర
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ గాంధీ
ఫ్యామిలీ కి ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత
మళ్ళీ ప్రధాన మంత్రి అవకాశం వచ్చింది. రాహుల్ గాంధీ ని ఈసారి ప్రధాని చేయాలన్నారు.
మోడీ పదేళ్ళ లో కులాల కొట్లాటలు తెచ్చాడని ఉద్యోగాలు, అభివృద్ధి అడిగితే రాముని అక్షింతలు పంపించడం చేశారని విమర్శించారు. దేవుళ్ల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తు న్నారని దీన్ని ప్రజలు గమనించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. రూ. 500 ఉన్న గ్యాస్ సిలిండర్ ను 12 వందలు చేసిన ఘనత మోడీ సర్కార్ కి దక్కిందని, అదానీ – అంబానీ రిలయన్స్, జియో ల కోసమే బీజేపీ పనిచేస్తుందన్నారు. గాంధీ ని చంపిన గాడ్సే కు మద్దతు తెలిపి పూజించే పార్టీ బీజేపీ పార్టీ అని, వాళ్ళు కాంగ్రెస్ ను పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నారని అన్నారు. కరోనా కష్ట సమయంలో ఎవరికి కేంద్రం, బీజేపీ సహాయం చేయలేదన్నారు.
నల్లధనం తీసుకువస్తా, ప్రతి అకౌంట్ లో పదిహేను
లక్షల రూపాయల వేస్తా అన్న మోడీ దాని మాట కూడా ఎత్తడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ గల్లీలో కూడా కనిపించదని దానికి ఓటు వేయడం దండుగా అన్నారు. వైల్డ్ లైఫ్ పేరుతో మారుమూల
ప్రాంతంలో అభివృద్ధి ని అడ్డుకుంటున్నదని, పదేళ్ల
పాలనలో ఎన్ని పర్మిషన్ లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమకు లొంగలేదని శిబూసోరెన్ వంటి గిరిజన నాయకుణ్ణి జైలు కు పంపిన చరిత్ర బీజేపీదని అన్నారు.
ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు కరెంటు, 500 కే గ్యాస్ సిలిండర్ను అందిస్తున్నామని, 92 శాతం మందికి రైతు బంధు ఇచ్చామని చెప్పారు. మొన్నటి దాకా నోరు తెరిస్తే బహుజన వాదం అంటూ, దళితుల పక్షపాతిగా గొప్పలు చెప్పిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు కేసీఆర్ పంచన చేరి కేసీఆర్ పాలన స్వర్ణయుగం అంటూ కితాబు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి, జడ్పీ మాజీ చైర్మన్ సిడం గణపతి తన అనుచరులతో సహా కాంగ్రెస్ లో చేరారు.