Monday , September 16 2024

మందుకు డబ్బుల్లేవు అంటే ఆత్మహత్య…

మద్యం కోసం రోజు తల్లితో గొడవ

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి ( కౌటాల ) : మార్చ్ 26

వాంకిడి : మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకొన్న సంఘటన వాంకిడి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోంది. వాంకిడి ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలం పునగూడ గ్రామ పంచాయతి పరిధిలోని సోనాపూర్ గ్రామానికి చెందిన మడావి సురేష్ (18) మద్యానికి బానిసై రోజూ తల్లి మడవి పార్వతీతో గొడవ పడేవాడన్నారు. సోమవారం హోలీ పండుగ సంధర్భంగా మద్యం తాగి హోలీ ఆడడానికి ఉదయం బయటికి వెళ్లాడు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికీ వచ్చిన సురేష్ మద్యానికి డబ్బులు ఇవ్వాలని తల్లితో గొడవ పడ్డాడన్నారు. తల్లి పార్వతి సురేష్ ను నీ తండ్రి చనిపోయి రెండూ సంవత్సరాలు అవుతుంది. నువ్వ నాకు ఆసరాగా ఉంటావు అనుకున్న కాని నువ్వే ఇలా మధ్యం తాగి డబ్బులూ వృదా చేస్తే ఎలా,నా దగ్గర డబ్బులు లేవు అని తల్లి మందలించడంతో సురేష్ కోపంతో ఇంట్ల నుంచి బయటికి వెళ్ళిపోయి, ఎదో గుర్తు తెలియని పురుగుల మందు తాగి,ఇంటికీ వచ్చి పురుగుల మందు తాగాను అంటూ వాంతులు చేసుకుంటూ తల్లితో చెప్పాడు.. అప్పటికే స్పృహ తప్పిపోయి కింద పడిపోయాడు. సురేష్ ని వెంటనే కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనంపై వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుండి అంబులెన్స్ లో అసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 6 :30 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని తల్లి మాడావి పార్వతి మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వాంకిడి ఎస్సై రాములు పేర్కొన్నారు.