తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : మార్చ్ 23
బెజ్జూరు మండల కేంద్రంలోని ఆటవి క్షేత్ర అధికారి కార్యాలయం ఎదుట శనివారం ఏటిగూడ గ్రామానికి చెందిన తలండి లస్మయ్య పై ఆటవి క్షేత్ర అధికారి దయాకర్ చేయి చేసుకున్నారని ఏటిగూడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం తలండీ లస్మయ్య తనకు సంబంధించిన అటవీ హక్కు పత్రం ఉన్న స్థలంలో చిన్న గుడిసెను వేసి గత 8 నెలల కాలంగా అందులో చిన్న షాపు ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతూ ఉన్నాడు. కాగా శుక్రవారం సాయంత్రం ఆ గుడిసెను సరిగ్గా చేసే క్రమంలో ఈ స్థలంలో గుడిసె వేయరాదని ఆటవి క్షేత్ర అధికారి దయాకర్ చేయి చేసుకున్నారని గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆటవి క్షేత్ర అధికారి దయాకర్ ని వివరణ కోరగా అలాంటిది ఏమీ గొడవ జరగలేదని, అతను వేస్తున్న గుడిసె ఈ స్థలంలో వేయకూడదని చెప్పిన కానీ వినకుండా ఉండడం వల్ల అతనికి సంబంధించిన గుడిసె సామాగ్రిని తీసుకువచ్చినా మని, గ్రామస్తులు అంత మూకుమ్మడిగా వచ్చి తమపై దాడికి యత్నం చేశారని అటవీ క్షేత్ర అధికారి దయాకర్ తెలిపారు. దాంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏటిగూడ గ్రామానికి చెందిన పలువురిపై అటవీశాఖ అధికారులు, తన భర్త ఆయన తలండీ లస్మయ్య పై అటవీ శాఖ అధికారులు చేసుకున్నారని అతని భార్య తలండి సుజాత ఆటవి క్షేత్ర అధికారి దయాకర్, బీట్ అధికారులు సంఘదీప్, అనిత లపై ఫిర్యాదు చేశారు…..