తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి ( కౌటాల ) : మార్చ్ 23
మిస్సింగ్ అయిన వ్యక్తి మృతదేహం లభ్యం
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం ఎల్లారం కంచరగూడ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బోయిని రాజ్ కుమార్ ఈనెల 19న ఇంట్లో నుండి తన ఆటోలో బయటకు వెళ్లి అడ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మద్యానికి బానిసైన కొడుకును తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోగా శనివారం మృతదేహం లభ్యమైంది. తండ్రి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.