Sunday , May 26 2024

ఎంపీపీ ప్రోత్సాహంతో అధికారులు పెన్షన్ ఆపివేయడం సరికాదు..

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి ( కౌటాల ) : మార్చ్ 23

చింతలమానేపల్లి మండల ఎంపీపీ డబ్బుల నానయ్య ప్రోత్సాహంతో అధికారులు గీతా కార్మికుడి నైనా తన పెన్షన్ ఆపివేయడం సరికాదని మండల కేంద్రానికి చెందిన గీతా కార్మికుడు రామగొని నీలాగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని నెలల నుండి గీతా కార్మికుడుగా వచ్చే తన పెన్షన్ను ఎంపీపీ నానయ్య అధికారులకు అధికార బలం ఉపయోగించి పెన్షన్ ఆపించారని అదే ఎంపీపీ భార్యకు బోదకాలు లేకున్నా తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి గత కొన్ని ఏండ్ల నుంచి పెన్షన్ పొందుతున్నట్లు ఆరోపించారు.డుబ్బుల నానయ్య తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. దీని విషయంలో అధికారులకు ఫిర్యాదు చేశామని వెంటనే తనకు నిలిపివేసిన పింఛను మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఆయన వెంట మండల నాయకులు డోకే రాజన్న ఉన్నారు.