Friday , November 15 2024

250 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు వాటర్ బాటిళ్లు పంపిణీ

కౌటల ఎస్సై మదుకర్

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : మార్చ్ 15

కౌటాల : మంచి మార్కులు సాధిస్తూ ఉన్నత చదువులో రాణించాలని కౌటాల ఎస్సై మధుకర్ పిలుపునిచ్చారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా
శుక్రవారం మండలంలోని జెడ్ పిహెచ్ఎస్ కౌటాల, ముత్యంపేట,
కెజిబివి కౌటల,
ఎ హెచ్ ఎస్ మోగడ్ ధగడ్,
జెడ్ పి హెచ్ ఎస్ బోధంపల్లి, గుండాయిపెట్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మదుకర్ మాట్లాడుతూ పరీక్షలంటే అనవసర ఆందోళన చెందవద్దని సూచించారు. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. 250 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు వాటర్ బాటిళ్లు అందజేశారు. పరీక్షలు నిర్భయంగా రాయాలని ఒక లక్ష్యంతో చదువుకోవాలని కోరారు. విద్యార్థులు ర్యాంకులు సాధించే విధంగా పట్టుదలతో ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చుకోవాలని ఎస్సై మదుకర్ కోరారు. అనంతరం మోగడ్ ధగడ్ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాద్యాయులు ఎస్ఐ కి సన్మానం చేశారు.