Wednesday , July 24 2024

కబ్జాదారులను చితకబాదిన గ్రామస్తులు

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి ( కౌటాల ) : మార్చ్ 15

కాగజ్ నగర్ మండలం రాస్పల్లి గ్రామంలో ఆంధ్రకు చెందిన భూ కబ్జాదారులను గ్రామస్తులు అడ్డుకొని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, రాస్పల్లి గ్రామంలోని భూములను కొందరు ఆంధ్రకు చెందిన గుత్తేదారులు కబ్జాకు పాల్పడి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేపించుకొని వేరే వారికి అమ్మే ప్రయత్నం చేయడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు కబ్జాదారులను అడ్డుకొని గురువారం సాయంత్రం నాలుగు గంటలకు చితకబాదారు, ఈ ఘటన శుక్రవారం ఉదయం 10 గంటలకు వెలుగులోకి వచ్చింది, తమ భూమిని మీకే పట్ట చేసి ఇస్తామని కబ్జాదారులు ఒప్పుకోవడంతో గ్రామస్తులు వెనక్కి తగ్గారు,