Wednesday , July 24 2024

కాగజ్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటన

మీ అందరి అభిమాన నాయకుడు,
ఈ ప్రాంతం బాగుకోరే ప్రజా నాయకుడు కోనేరు కోనప్ప గారు కాంగ్రెస్ లో చేరడం శుభ పరిణామం
-తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క

నా ప్రాంతంలో నా ప్రజల సమక్షంలోనే చేరతా అని కోనప్ప గారు చెప్పడం,
ఈ నియోజకవర్గంపై వారి ప్రేమకు నిదర్శనం..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన సమయంలో సైతం నియోజకవర్గ అభివృద్ధి పై కోనప్ప గారు విన్నవించారు

అందవెల్లి వంతెనను పరిశీలించిన మంత్రి

మరో రెండు మూడు రోజుల్లో వంతెన మరమ్మతుల పనులను పునఃప్రారంభిస్తాం.

-మంత్రి సీతక్క

సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు..
కాగజ్ నగర్ పట్టణంలోని వినయ్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో కోనేరు కోనప్ప గారితో సహా జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు గారు మున్సిపల్ చైర్మన్ షాహీనా సుల్తానా మరియు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు కోనేరు అభిమానులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు..
వారందరికీ మంత్రి సీతక్క గారు మూడు రంగుల జెండా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు..

అంతకుముందు కాగజ్ నగర్ చెక్ పోస్ట్ వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఘన స్వాగతం పలికిన కోనప్ప గారు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు..
అనంతరం అందవెల్లి వంతెనను మంత్రి పరిశీలించారు..నా సిర్పూర్ నియోజకవర్గ అభివృద్దే నాకు ముఖ్యంమాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పనా సిర్పూర్ నియోజకవర్గ అభివృద్దే నాకు ముఖ్యమని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు తెలిపారు..
ఈరోజు కాగజ్ నగర్ లో మంత్రి సీతక్క గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం కోనేరు కోనప్ప గారు మాట్లాడుతూ,
ఎటువంటి పెదవులు ఆశించి పార్టీలో చేరటం లేదని నా నియోజకవర్గ అభివృద్దే ధ్యేయమని కోనేరు కోనప్ప గారు తెలిపారు..
నన్ను ఓడించేందుకు తెరవెనుక ఎన్నో శక్తులు పనిచేసాయని ఆ శక్తులతో వారు ఈరోజు జతకట్టడం చాలా బాధ కలిగించిందని వాపోయారు..
ఎక్కడో ఆలంపూర్ నుంచి వచ్చిన వ్యక్తి సిర్పూర్ లోనే నా శేష జీవితం అని చెప్పి,
ఈరోజు ఇక్కడ అడ్రస్ లేకుండా పోయాయని తెలిపారు,
ఎంతో మంది పేద బిడ్డలను చదివించానని ప్రగల్భాలు పలికిన ఆ వ్యక్తి మాటలు బూటకమని,
నిజంగా సిర్పూర్ లో ఎంతో మంది విద్యార్థులకు అన్నం పెట్టి పుస్తకాలిచ్చి ఫీజులు కట్టి చదివించానని కోనప్ప గారు తెలిపారు..
రాబోయే ఒక్కొక్కటిగా మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించుకుందామని తెలిపారు..పేదింటి పెళ్లిల్లు తన సొంత బిడ్డ పెళ్లిలా చేసిన గొప్ప వ్యక్తి కోనప్పన్న, అటువంటి లీడర్ ను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నాం
-మంత్రి సీతక్కఈ సందర్భంగా మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి కొట్లాడి మీలో ఒకడిగా మీతో ఉండి సేవచేసే కోనప్పన్న లాంటి నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావటం శుభ పరిణామం,
వారి రాకను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం,
నా నియోజకవర్గం ములుగులో పరిస్థితులు చూసిన దాన్ని,
అలాగే ఈ ప్రాంతం కూడా మారుమూల ప్రాంతం,
ఈ ప్రాంతాన్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది,
ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి సీతక్క తెలిపారు..