Saturday , October 12 2024

ఇంచార్జి స్పెషల్ ఆఫీసర్ నిర్లక్ష్యంతో కేజీబీవీలో విద్యార్థుల ఆందోళన.

విద్యార్థులు ఎక్కువ చేస్తే కేసులు పెడతా.. ఇన్చార్జి ఎస్ ఓ .

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : మార్చ్ 07

చింతలమానేపల్లి మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థులు గురువారం ఆందోళన దిగారు. సందర్భంగా విద్యార్థులకు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ సెకండ్ హ్యాండ్ లో మొత్తం 14 మంది విద్యార్థులను ఉన్నామని, మ్యాథ్స్ కు సంబంధించిన టీచర్ లేకపోవడంతో పరీక్షలు సరిగా రాయకపోవడంతో మ్యాత్స్ సంబంధించి టీచర్ కావాలని ,ఇన్చార్జి ఎస్ఓ శ్రీదేవిని అడగగా నిర్లక్ష్యంగా మాట్లాడిందని, చాలా ఎక్కువ చేస్తున్నారు. మీపై కేసులు పెట్టిస్తానని బెదిరించారని ఈ సందర్భంగా విద్యార్థులు వాపోయారు.
భోజన వసతి కూడా కల్పించలేదని ఈ సందర్భంగా విద్యార్థులు ఆరోపించారు.