Monday , November 11 2024

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు…

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి ( కౌటాల) : మార్చ్ 03

దహేగాం మండలం బిబ్రా గ్రామానికి చెందిన నిరూ పేదా నయిమ్ కూతురు షహనాజ్ ఇటీవల మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కాగా పండంటి పాపకు జన్మనిచ్చిన తల్లి డెలివరీ సమయంలో ఆపరేషన్ వికటించడంతో మంచిర్యాలలోని మెడ్ లైఫ్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనితో అక్కడ డాక్టర్లు డెలివరీ ఆపరేషన్ వికట్నించినట్లుగా కడుపులోని పేగు చెడిపోయినట్లుగా నిర్ధారించారు. మళ్లీ ఆపరేషన్ చేయడానికి సుమారు మూడు లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినారు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరు పేద కుటుంబం అంత పెద్ద మొత్తం వారి వద్ద లేకపోవడంతో 3 లక్షలు సమకూర్చడంలో సహకరించవలసిందిగా దాతల వైపు చేతులు చాచి ఎదురుచూస్తున్నారు. దాతలు సహకరించి చేయూతనిచ్చి రెండు ప్రాణాలను తల్లి బిడ్డల క్షేమాన్ని ఆకాంక్షిస్తూ విరాళాలు ఇవ్వాల్సిందిగా చేతులు జోడించి వేడుకుంటున్నాం

వైద్య ఖర్చులకు విరాళం అందించువారు ఫోన్ పే 8074922827 విగ్నేష్, 9951806344 మణికంఠ

పైన పేర్కొన్న నెంబర్లకు విరాళాలు అందించి స్క్రీన్ షాట్ వాట్సప్ చేయగలరు…