Thursday , May 23 2024

ఆశ వర్కర్ల వేతనం కోసం వినతి

తెలంగాణ కెరటం కౌడిపల్లి ప్రతినిధి ఆగస్టు 9

మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో శ్రీయుత గౌరవ నీయులైన పీహెచ్ సి మెడికల్ ఆఫీసర్స్ గారికి నమస్కరించి వ్రాయునది ఏమనగా
ఫిక్సడ్ వేతనం కోసం గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల అనుబంధ (ఆశా) సంఘం బి.ఆర్.టి.యు యూనియన్ తరుపున తెలంగాణా వ్యాప్తంగా ఫిక్సడ్ వేతనం ఇవ్వాలని డి ఎం మరియు హెచ్ ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మహర్యాలి తొ వెళుతున్నాం ,కావున 10-8-23 గురువారం రోజున మేము లెటర్ ఇచ్చి వచ్చే వరకు విధులకు హాజరు కాలేము సార్
దయచేసి మాకు ఆరోజు మేము ఫిక్స్డ్ వేతనం సాధనలో మీరు కూడామాకు సహాయం చేయగలరని మనవి చేసుకుంటున్నాము .
బి ఆర్ టి యు గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల ( ఆశా) సంఘం పిహెచ్ సి కమిటి పాల్గొన్నవారు శ్యామల, సుగుణ, చెన్నమ్మ, పద్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.