Monday , September 16 2024

అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి

తెలంగాణ కెరటం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి జూన్ 17

అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్ల స్థలాలను కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, మండల కార్యదర్శి చిలుక రాఘవులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామంలో శనివారం వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ శాఖ కార్యదర్శి వల్లెపు రమేష్ అధ్యక్షతన వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాల పేరట ప్రభుత్వ దానాన్ని దుర్వినియోగం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. మండలంలోని నిల్వన నీడలేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ స్థలంలో ఇండ్ల స్థలాలను కేటాయించి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన మూడు లక్షల రూపాయలను వెంటనే విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందారని గుర్తు చేశారు. ఇళ్ల స్థలాల కోసం మండలంలోని నిరుపేద ప్రజలందరూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 19 న నిర్వహించే తాసిల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేసే కార్మిక సంఘం జిల్లా నాయకురాలు ఆరూరి భాగ్యలక్ష్మి, గ్రామ అధ్యక్షురాలు సుల్లూరి ప్రమీల, ఉపాధ్యక్షురాలు మోడం రాజేశ్వరి, కమిటీ సభ్యులు బత్తిని లావణ్య, కందుకూరి రేణుక, మోడం కవిత, కందుకూరి సుగుణ, కర్నే దీప, కందుకూరి ప్రభాకర్, మేకల సరిత, కందుకూరి నాగులు, మేకల తిరుమల, కందుకూరి జయరాజ్, కమలాకర్, బరిగెల ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.