Tuesday , July 16 2024

ఆర్మూర్ బస్టాండ్ ప్రాంగణంలో చల్లని త్రాగే నీరు పక్కన మురికి..???

తెలంగాణ కెరటం ఆర్మూర్ మే 07:
ఆర్మూర్ బస్టాండ్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కలెక్షన్ల పరంగా ముందున్న పలు జిల్లాల నుండి కూడలిగా అన్ని బస్సులు ఆర్మూర్ బస్టాండ్ ను వచ్చి పోతుంటాయి అలాంటి నిత్యం రద్దీగా ఉండే ప్రయాణ ప్రాంగణంలో డిపో నిర్వాహకుల అసమర్ధత ,పర్యవేక్షణ లోపం వలన త్రాగునీరు పక్కనే మురికి నీరు ప్రవహిస్తున్న ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం స్వయానా డిపో మేనేజర్ తన ఆఫీస్ కి వెళ్లే దారిలోనే నిత్యం తరసపడుతున్న కనీసం స్పందించకపోగా ఆ దిశగా అయిన చర్యలు తీసుకోకపోవడం ప్రయాణికులు తీవ్రమైన వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. అంతేకాకుండా చల్లని త్రాగే నీరు పేరున కుళాయి నీళ్లను పోస్తున్నారు. పక్కనే తినుబండారాలకు స్టాళ్లను ఏర్పాటు చేసినారు. ఈ మురికి నీరు పైన వాలిన ఈగలు తినుబండారాలపై వాలి తినుబండారాలను తినే ప్రయాణికుల ఆరోగ్యము దెబ్బతింటుందని దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పని పరిస్థితుల్లో తిని వారి ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారని వాపోతున్నారు. బస్టాండ్ కి వచ్చే ప్రధాన ద్వారం కూడలిలోనే మురికి నీరు ప్రయాణించడం వలన బస్టాండ్ లోకి వచ్చే ప్రయాణికులు మురికి నీటిలో నడుచుకుంటూ రావలసిన పరిస్థితి ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి కారణంగా ఆరోగ్య సమస్యల నుండి బయటపడుతున్న ప్రయాణికులకు ఇప్పుడిప్పుడే రద్దీతో కళకళలాడుతున్న ప్రయాణ ప్రాంగణాలు అధికారుల నిర్లక్ష్యం వలన ఇబ్బందులకు గురి అవుతున్నారు. తక్షణమే ఈ సమస్యపై చర్యలు తీసుకొని కుళాయి నీళ్ళకు బదులు మంచినీరును ప్రయాణికులకు అందించాలని ఇక్కడికి వచ్చే ప్రయాణికులు కోరుకుంటున్నారు.