1951నుండీ దేశంలో పని చేస్తున్న ఏకైక యూనియన్
ప్రభుత్వాలు ఏవి ఉన్నా జర్నలిస్టుల హక్కులకై పోరాటాలు తప్పవు
జాతీయ నాయకుల ఆధ్వర్యంలో
టీజేయు 2024 డైరీ ఆవిష్కరణ
యూనియన్ విస్తరణకు కలిసికట్టుగా పనిచేద్దాం
ఆంధ్ర ప్రదేశ్
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల (చిన్న తిరుపతి) లో జరిగిన 133వ వర్కింగ్ కమిటీ సమావేశంలో జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్య సెక్రెటరీ జనరల్ పరమానందం పాండే లు మాట్లాడుతూ ఐ ఎఫ్ డబ్ల్యూ జే దేశవ్యాప్తంగా బలోపేతం చేయాలని పిలపునిచ్చారు.
జర్నలిస్టుల హక్కుల లక్ష్యమే ధ్యేయంగా పనిచేస్తూన్న యూనియన్ ను బలహీన పరచాలని కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అంతకు రెండింతల శక్తితో దేశంలో బలంగా పనిచేస్తున్న యూనియన్ మనదే అన్నారు.1951 నుండి జర్నలిస్టుల హక్కులకై పోరాటం చేస్తున్న ఏకైక సంఘం దేశంలో మరొకటి లేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వాలు ఏవి ఉన్నా జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం చేసే పోరాట ప్రతిమ ఉన్న ( IFWJ)
మరింత బలంగా కావాలని ఆకాంక్షించారు.
దేశంలోనే కాకుండా ప్రపంచంలో మరిన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగి పనిచేస్తున్న యూనియన్ మనదే అన్నారు.యూనియన్ బలోపేతం కోసం కష్టపడుతున్న ఐ ఎఫ్ డబ్ల్యూజే జాతీయ ఉపాధ్యక్షులు పెద్దపురం నరసింహను ఈ సందర్భంగా కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ లో యూనియన్ ఉనికి కోసం కృషిచేసిన జర్నలిస్టు వలి కి శుభాకాంక్షలు తెలిపారు.
వివిధ రాష్ట్రాల్లో బలోపితం కోసం పనిచేస్తున్న ఐ ఎఫ్ డబ్ల్యూ జే సీనియర్ ఉపాధ్యక్షులు హేమంత్ తివారి శ్రమ ఊరికే పోదన్నారు. సమావేశ విజయానికి పనిచేసిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు ను అభినందిస్తూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులు చేసే నిరసన కార్యక్రమాల్లో పాల్గొని హక్కులను సాధించుకోవాలని దిశా నిర్దేశం చేశారు.
వివిధ రాష్ట్రాల్లో జర్నలిస్టు యూనియన్ బలోపితం చేయడమే లక్ష్యంతో ముందుకు పోయి హక్కులను సాధించుకోవాలని అన్నారు. 2024 డైరీ ఆవిష్కరణ జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్య సెక్రెటరీ జనరల్ పరమానంద్ పాండే జాతీయ నాయకుల మధ్యలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ఇన్ని రోజులు ఆ వేడుక కోసం వేచి చూశామనీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు అన్నారు ఈ కార్యక్రమంలో (IFWJ )సెక్రెటరీ భరత్ కుమార్ శర్మ తెలంగాణ జర్నలిస్ట్ ఇండియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజమౌళి గౌడ్ రాష్ట్ర కార్యదర్శి దశరథ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాపు రావు నాయకులు సాయి శరత్ ప్రసాద్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ అస్సాం ఒరిస్సా ఢిల్లీ తదితర రాష్త్ర ల జర్నలిస్ట్స్ లు పాల్గొన్నారు.