Wednesday , September 18 2024

అన్యక్రాంతమౌతున్న అటవీ సంపద

చోద్యం చూస్తున్న అధికారులు

తెలంగాణ కెరటం, రుద్రంగి మండల ప్రతినిధి, అక్టోబర్ 23:

రుద్రంగి మండల కేంద్రంలోని నల్లగుట్ట ప్రాంతంలో అటవీ చెట్లను ధ్వంసం చేసి భూమి ఆక్రమించుకోవాలని కొందరు వ్యక్తులు చూస్తున్నారని ఆ ప్రాంత రైతులు అన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆదివారం రోజున నల్లగుట్ట ప్రాంతంలోని టేకు చెట్లను వివిధ రకాల పండ్ల చెట్లను నరికివేసారని వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చామని అన్నారు. ఫారెస్ట్

అధికారులు వచ్చి అటవీ సంపదను ధ్వంసం చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పినా వినకుండా అటవీ చెట్లను, అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసారని వారిపై అధికారులు తగిన చర్యలు తీసుకొని అటవీ భూములను కాపాడాలని కోరారు. అడవిని ధ్వంసం చేసి అటవీ భూములను ఆక్రమించుకోవడం రుద్రంగిలో యథేచ్ఛగా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.