వ్రాత పూర్వకంగా పిర్యాదు చేస్తేనే చర్యలు లేకపోతే లేదు
టౌన్ ప్లానింగ్ ఆఫీసర్:-సాయి కృష్ణ
తెలంగాణ కెరటం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నవంబర్:-14రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం లో నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయిబీదవారు నూతనం గా ఇంటిని నిర్మించుకుంటే అనుమతుల పేరిట వారిని ఆఫీస్ చుట్టూ తిప్పుకొనే అధికారులకు నాయకుల అండదండలతో ఎలాంటి అనుమతులు లేకుండా సెల్లార్ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాయి కృష్ణ ను చరవాణిలో సంప్రదించగా వ్రాత పూర్వకంగా పిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకొంటాం లేకపోతే తీసుకోము అని సమాధానం చెప్పుకొచ్చారు దీనితో అట్టి ఇంటిని నిర్మిస్తున్న కాంట్రాక్టర్ కు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కు సత్సంబంధాలు ఎంతవరకు ఉన్నాయో తెలుస్తున్నది గత కొద్ది కాలం క్రితం జగిత్యాల వెళ్లే రోడ్డు లో ఎంలాంటి అనుమతులు లేకుండా ఓ వార్డు కౌన్సిలర్ ఓ భవనాన్ని నిర్మించాడు అట్టి భవన నిర్మాణం గురించి వేములవాడ మున్సిపల్ కార్యాలయం లో చర్చ కొనసాగుతున్నది ఇప్పటి వరకు ఆ కౌన్సిలర్ నిర్మించిన భవనం పై ఎలాంటి చర్యలు లేవు ఇటీవల ఓ కౌన్సిలర్ ఒక ఇంటి యజమానితో ఏ అధికారి ఏ నాయకుడు తో పాటు కౌన్సిలర్ కు ఎంత ముట్టజెప్పాలని మాట్లాడుకున్న సన్నివేశాన్ని అట్టి ఇంటి యజమాని ఆ ఆడియో రికార్డు ను బయట పెట్టాడు విషయం తెలుసుకొన్న అధికారి ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు ఇప్పటికైనా ఉన్నాతాదికారులు అట్టి టౌన్ ప్లానింగ్ అధికారి పై విచారణ జరిపి చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది