అనుమాన స్పందంగా బాలుడు మృతి
ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్ తండా గ్రామపంచాయతీకి చెందిన మాలోత్ ఉదయ్ ( 11 ) అనే గిరిజన బాలుడు శనివారం రాత్రి 7-00 గంటల ప్రాంతంలో అనుమాన స్పందంగా మరణించాడు , కిష్టునాయక్ తండా గ్రామపంచాయతీకి చెందిన ఆ బాలుని తల్లి దండ్రులు మాలోత్ ప్రశాంత్ నాయక్ , రేణా శనివారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్ళగా రాజన్న పేట గ్రామంలోని ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 6 వ తరగతి చదువుతున్న మాలోతు ఉదయ్ ఇంటి వద్దనే ఉండిపోయాడు తమ ఇంట్లో వంట గది లోకి వెళ్ళి గడియపెట్టి లుంగీ తో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు , పొద్దంతా వ్యవసాయ పనులకు వెళ్లి సాయంత్రం ఏడు గంటలకు తిరిగి ఇంటికి వచ్చిన ప్రశాంత్ , రేణా ఇంటి వద్ద కొడుకు కనిపించకపోవడంతో ఊరంతా వెతికారు ఇంటికి వచ్చి వంటగది గడియ పెట్టి ఉండడంతో అనుమానం వచ్చి తలుపులు పగులకొట్టి చూడగా గోడ మేలకు లుంగీతో మెడకు చుట్టుకొని ఉరి వేసుకుని కొన ఊపిరితో ఉండగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్లు తెలుస్తోంది , ఉదయ్ మృతదేహాన్ని చూసి తల్లి దండ్రులు బంధుమిత్రులు బోరున విలపిస్తున్నారు , దీంతో కిష్టునాయక్ తండా గ్రామపంచాయతీలో విషాదం నెలకొంది. ఎల్లారెడ్డిపేట పోలీసులు ఉదయ్ మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం శనివారము రాత్రికిరాత్రే తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు…