Wednesday , July 24 2024

అన్నదాతకు నష్టపరిహారం అందేనా….

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇంకా పంట, పరిహారం అందలేదు

పంట నష్టం పరిహారం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు

పరామర్శలకేనా, పరిహారం రాదా

తెలంగాణ కెరటం, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ;

ఈదురుగాలితో కూడిన వడగళ్ల భారీ వర్షాలకు,దెబ్బతిని నష్టపోయిన పంటలకు ఎకరానికి 10 వేల మేర నష్టపరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటలు నేటికీ అమలు కాకపోవడం రైతన్నల్లో ఆందోళన మొదలైంది. ఈ యేడాది ఐనా ఆ పంట నష్టపరిహరం వస్తాయ, రావా ఆన్న సందిగ్ధంలో పడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా లోని ఆయ అయ మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు సర్వే చేసి నివేదిక అందించి నెల రోజులు గడిచిపోయిన కూడా రైతు ఖాతాల్లో పరిహారం డబ్బులు జమకాకపోవడంతో రైతులు,ఎప్పుడు పడుతయోనాని ఎదురుచూస్తున్నారు, ఆసలు నష్టపరిహారం వచ్చేన లేదా అని రైతులు గ్రామాల్లో గుసగుసలాడుకుంటున్నారు. సర్వే జరిపి నెల రోజులు గడుస్తున్న పరిహారం అందకపోవడం తో ఆసలు సర్వే సమగ్రంగా జరిగిందా. లేక ,ఆ సర్వే నివేదికలు ప్రభుత్వానికి చేరయ లేదా ఆన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

అకాల వర్షాలకు మండల వ్యాప్తంగా 957 ఎకరాల నష్టం

ఈ ఏడాదిలో యాసంగి పంటలు చేతుకచ్చే సమయంలో వడగాల్లు ,రాళ్లతో కూడిన భారీ వర్షాలకు పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత నెల ఎప్రిల్ 17 నుండి 23 వరకు కురిసిన వర్షాలకు గాను కోనరావుపేట మండల వ్యాప్తంగా 1407 మంది రైతులకు గాను దాదాపు 957 ఎకరాల మేర పంట నష్టం వాటిల్లింది అని వ్యవసాయ అధికారులు నిర్ధారించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం మేరకు ఎకరానికి 10 వేల రూపాయలు నష్టపరిహారం అందిస్తాం అని అన్నారు.ప్రభుత్వ ఆలోచనా ప్రకారం మండల మొత్తంగా దాదాపు 10 లక్షల రూపాయలు పరిహారం అందించాలని ప్రభుత్వానికి ఈ నెల 15న జిల్లా వ్యవసాయ అధికారులు నివేదికను ప్రభుత్వానికి అందించినట్లు సమాచారం.

నష్టపోయినా రైతులకు,పరిహారం అందేనా

అకాల వర్షాలకు మండల వ్యాప్తంగా 1407 మంది రైతులకు 957 ఎకరాలు నష్టం వాటిల్లింది.మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నివేదిక రిపోర్ట్ ని ప్రభుత్వానికి పంపించారు.పెద్దపల్లి జిల్లాలో మర్చి నెలలో అకాల వర్షాల ప్రభావంతో నష్టపోయిన రైతులను పరమర్షించడానికి వెళ్లిన ముఖ్యమంత్రి అప్పుడు,వడగళ్ల వర్షాలకు ఆయ ఆయ జిల్లాల్లో నష్టపోయిన పంట వివరాలు, నష్టాలను సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక పంప్పంది అని వ్యవసాయ అధికారులను ఆదేశించి జి ఓ ను జారీ చేశారు.నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది అని హామీ ఇచ్చి 2 నెలలు గడుస్తున్నా , ఇప్పటికీ వరకు కూడా ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు.ఎప్పటికైనా ప్రభుత్వం మరియు అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయవలసిందిగా అన్నదాతలు అదుకోవల్సింది గా కోరుకుంటున్నారు.