Saturday , October 12 2024

అన్న కోసం తమ్ముడి మొక్కు..

పాదయాత్రగా మఖ్తల్ నుంచి తిరుమలకు..

ఎమ్మెల్యేగా గెలవడంతో మొక్కు తీర్చుకుంటున్న తమ్ముడు
వాకిటి శేషగిరి…
తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.
మఖ్తల్ నియోజకవర్గ చరిత్రలోనే మఖ్తల్ పట్టణవాసి ఎన్నడూ మఖ్తల్ ఎమ్మెల్యేగా గెలవకపోవడంతో తన అన్న వాకిటి శ్రీహరి చరిత్ర తిరగ రాయాలని… ఆ రికార్డు అందుకున్న తొలి వ్యక్తిగా ఘనత సాధించాలని… మఖ్తల్ ఎమ్మెల్యే గా ఎన్నిక కావాలని తమ్ముడు వాకిటి శేషగిరి మొక్కుకున్నాడు. ఎమ్మెల్యేగా గెలిస్తే మఖ్తల్ నుంచి తిరుమలకు పాదయాత్రగా వస్తానని ఇష్ట దైవం వెంకటేశ్వరుని వేడుకున్నాడు. అనుకున్నట్టుగానే నియోజకవర్గ ప్రజల అశేష అభిమానంతో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు వాకిటి శ్రీహరికి అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టి ఎమ్మెల్యేను చేశారు. దీంతో తన మొక్కు ప్రకారం జనవరి 20వ తేదీన తమ్ముడు వాకిటి శేషగిరి మఖ్తల్ పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు 500 కిలో మీటర్ల దూరం ను పదిరోజులపైగా నడిచి బుధవారం వరకు తిరుపతి శివార్లకు చేరుకున్నారు. మరికొన్ని గంటల్లో తిరుమలకు చేరుకుని, స్వామి వారి మొక్కు చెల్లించుకోవడం ఆనందంగా ఉందని వాకిటి శేషగిరి తెలిపారు. తనతోపాటు పాదయాత్రగా నడిచిన కావలి రాజేందర్, కర్ని లింగం, చందాపూర్ వెంకట్రాములుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మఖ్తల్ నుంచి తిరుమలకు పాదయాత్ర చేసిన తొలి మఖ్తల్ వాసి వాకిటి శేషగిరి అని పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.