Wednesday , July 24 2024

అన్నదాతకు,అడుగడుగునఆరిగొసలు… కన్నీరు మున్నీరు అవుతున్న రైతన్నలు ఆరుకలం చేసిన పంట అడుగు నాశనం…?? వడగల్లు వానతో అన్నదాతల బతుకులు ఆగం

కష్టాల కడలిలో, ఏదురితున్న రైతన్న

నకిలీ విత్తనాలు,ఎరువులతో మోసపోతు

నీటి కొరతతో,వేసిన పంటకు,నీరు అందక ఎండిపోతు నష్టం జరిగే

వన్య ప్రాణులు బెడద,మోగిపురుగు,మెడ విరుపు,చిడపురుగులతో తీరని తిప్పలయే

భారీ వడగళ్ళ వర్షానికి, పంటలు అన్ని రాలిపాయే

దళారీ దందాతో,దోపిడీకి గురవుతూ

తెలంగాణ కెరటం,రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ;

అందరికీ అన్నం పెట్టే రైతన్న పరిస్థితి నేడు అరమ్య గోచరంగా తయారైంది.ఈ యాసంగి పంట వేసింది మొదలు ఆడుగడుగున కష్టాల కొలిమిలో ఎదురీతకు గురయ్యాడు.నకిలీ విత్తనాలు,ఎరువులతో మొసపోతు,మొలక దశలో వన్యప్రాణుల బేడదతో,వేసిన పంటలకు మధ్యలో నీరు అందక,నీటిఎద్దడితో తీవ్ర ఇబ్బందులయే.అటో, ఇటో కష్టపడితే మొగిపురుగు, మెడవిరుపు అని చీడపురుగులతో తీవ్రనష్టం పాయే.భారీ వర్షాభావం వెంటాడింది. సాగు విస్తీర్ణం తగ్గింది. పెట్టుబడి పెరిగింది. గిట్టుబాటు ధర లేదాయే,కొనుగోలు కేంద్రాలు ప్రారంభంలో జాప్యం ఆయే, దళారీల దందా ఎక్కువయ్యే.అధికారుల పర్యవేక్షణ తక్కువయే. ఆ అన్నదాత అన్నిటిని తట్టుకొని భూ తల్లిని నమ్ముకొని నిలబడితే వరుణుడు ఉగ్రరూపం దాల్చడంతో ఉన్నది కాస్త పోయి చివరకు మన్నే మిగిలే. వరి,మామిడి,మొక్కజొన్న, పంట వేస్తున్న రైతులు ఆడుగడుగున కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి.పంటలు నమ్ముకొని నష్టపోయిన రైతులకు, నష్టపరిహారం అందిస్తాం ఆన్న ప్రభుత్వం నిర్ణయం పై నష్టపోయిన రైతులను గుర్తించడంలో అధికారులు కూడా పర్యవేక్షణ ఏమో కరువైపాయే,మరోవైపు ప్రభుత్వ సాయమూ చేస్తా ఆన్న మాటలు కోటలు దాటే ,పైసా కూడా ఇస్తలేపాయే ఇంకో వైపు రాజకీయ నాయకులు ,రైతన్న పరామర్శలు అని వారి స్వంత రాజకీయ స్వాలోబలకొసమే వాడుకోవడం తప్ప,నష్టపోయిన రైతన్నకు ఆడుపోధాడుపో సహాయం అందింది లేపయే.ముఖ్యంగా రైతుకు, భరోసా ఇచ్చే పథకం ఏ ఒక్కటి లేదు, మండల వ్యాప్తంగా గత యేడాది 9వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లిన ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ కూడా నష్టపరిహారం రాష్ట్రా ప్రభుత్వం వర్తింపజేయలేదు. వ్యవసాయ ఉపకరణాలపై సబ్సిడీ జాడే లేకపయే. ఇలా ఒకటీ రెండూ కాదు… రైతులకు అన్నింటా కష్టాలే. నకిలీ విత్తనాలు,ఎరువులుపై,అధికారుల పర్యవేక్షణ కరువు,వేసిన పంటకు మధ్యలో నీరు అందక, నీటి కొరతతో,మొగిపురుగు, మెడవిరుపు అంటూ పంటను కాటేసిన చీడపురుగులతో వచ్చిన రోగాలను మందులతో నయం చేసి ,ఆటో ఇటో గడ్డకు ఎక్కితే,ఆ ప్రకృతి కోపానికి ఉన్నది, కాస్త మన్ను పాలుఅయి, నష్టాల కొలిమిలో నేట్టేసే అన్నదాతను ఆగం ఆగం చేసే.రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలోని దాదాపు 17 వేల ఎకరాల సాగు భూమి వ్యవసాయం మీదే ఆధార పడి బతుకుతున్న కుటుంబాలు,ఎన్ని కష్టాలు వచ్చిన భూ తల్లినే నమ్ముకొని అప్పో,సప్పో చేసి మరో పంట ఐనా బాగా పండకపోతుంద,కష్టాలు తొలగిపోకపోతాయ అని నమ్మకంతో పంటలు చేస్తూ దిన దినము కష్టాల కొలిమిలో కూరుకుపోయి ఎందరో రైతన్నలు తనువు చాలిస్తున్నారు. దాదాపు 80శాతం మంది ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నా కుటుంబాలు ఉన్నాయి. పెద్దగా సాగునీటి వనరులు లేకున్నా. నిమ్మపెళ్లి ములవాగు ప్రాజెక్ట్ పైన,చెరువులు కుంటల పైన ఆధారపడి ములవాగు పరిసరాల ప్రాంతాల గ్రామాలు నిమ్మపెల్లీ, వట్టిమల్ల, బావుసాయిపేట, మమిడిపెల్లి,కొండాపురం, వెంట్రవుపేట,నిజామాబాద్,కనగర్థి,గ్రామాల్లో పంటలు పండించుకుంటు రైతన్నలు కాలం వెళ్లదీస్తున్నారు.ఆధునీకరణ పనులు కూడా ఏటా జరగకపోవడంతో చివరి ఆయుకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది.ఈ యసంగి పంటలో మండల కేంద్రంలో నీటి కొరత ఏర్పడటంతో దాదాపు 2వేల ఎకరాలు పంటలు కూడా ఆయ అయ గ్రామాల్లో ఎండిపోయి నష్టాలు వాటిల్లింది.ఆటో ,ఎటో బైటపడ్డం అని అన్నదాత అనుకొనే లోపే మొగిపురుగు, మెడ విరుపు,అగ్గితెగులు అంటూ తీవ్ర నష్టాన్ని చేసింది. ఇక సాగుచేసిన చోటా పెట్టుబడులు రెంట్టింపు అయ్యాయి. ఎకరాకు రూ.30వేల నుంచి రూ.40వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. తీర ధర చూస్తే క్వింటాల్ ధాన్యం గిట్టుబాటు లేకపటే రూ. ఆటో, ఇటో పంట చేతికందే సమయానికి కాస్త, కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అన్న చందంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో జాప్యం చేస్తూ ముందుకు రావడం లేదు. ప్రతి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం ఆన్న ప్రభుత్వం మాటలు ఉట్టి మాటలయే. కొనుగొలు కేంద్రాలు ఏర్పాటు చేసిస్తున్నం అని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులు వాటికి కొనుగోలు ప్రారంభాలపై శ్రద్ధపెట్టడం లేకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటను కోసి కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు కాస్త,వర్ష ప్రభావానికి తడిసిపోయి తీవ్ర నష్టాలు వాటిల్లుతుంది. అన్ని తట్టుకొని నిలబడితే,ఉన్నది కాస్త వరుణుడు ఉడ్చుకపాయే అని రైతన్నలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

నకిలీ విత్తనాలు, ఎరువులతో తక్కువ దిగుబడి

ఆరుగాలం కష్టపడిన,అన్నదాతలకు ఆకలి బాధలు, మోసాలు మాత్రం పోవడం లేదు,దుక్కిధున్ని నాట్లు వేసింది మొదలు ఎదో రకంగా మోసపోతును,నష్టపోతు కష్టాలపాలవుతున్నాడు. ఈ కలియుగంలో బతకడానికి ఎన్నో అడ్డదారులు తొక్కుతూ,ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు,రోజుకో పేరున అక్రమార్కులు,మోసాలకు పలుపడుతు కంపెనీలు వెలుస్తున్నాయి,ప్రభుత్వ ఆమోదం లేకుండా నకిలిగా తయారు చేస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.రోజుకో కొత్త పేరుతో వివిధ కంపెనీల పేరుతో విత్తనాలు,ఎరువులు మార్కెట్లోకి వస్తున్నాయి.ఆ నకిలీ విత్తనాలను,ఎరువులను నమ్మి పెట్టుబడి పెట్టిన రైతన్న కాస్త దిగుబడి లేక,విత్తనాలు సరిగా మొలకేతాక పంట నష్టం వాటిల్లుతుంది. ఐనా వ్యవసాయ అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం, లేదా రైతులకు పంటలకు వాడే ఎరువుల పైన విత్తనాల పైన సరైన అవగాహన కల్పించకపోవడం ప్రధాన కారణం.అధికారుల నిర్లక్ష్యం వలనే రైతాంగానికి ఒకరకంగా నష్టం.మార్కెట్లో ఎన్నో రకాల నకిలీ విత్తనాలు అమ్ముతున్నప్పటికి వ్యవసాయ అధికారులు పర్యవేక్షణ కరువైంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

యాసంగి పంటకు నీటి గొసతో వాటిల్లిన నష్టం

యసంగిలో సాగు చేసిన పంటకు మధ్యలో నీరు అందక దాదాపు 1 వెయ్యి నుండి 2 వేల ఎకరాలు వరకు పంటలు ఎండిపోయాయి నష్టం వాటిల్లింది.తెలంగాణ రాష్ట్రం రైతన్నలకు పెద్ద పీట వేస్తున్నాం అంటూ,పల్లే పల్లేన 24 గంటల కరెంట్ ఉచితం ఆన్న విషయంలో ఈ యసంగీ పంటకు కరెంట్ లేక వేసవి కాలం ప్రారంభ దశలోనే మరియు తీవ్ర ఎండలు కొట్టడంతో వేసిన పంటలు కాస్త నీటి ఎడ్డదితో ఎండిపోయి నష్టాల పాలయ్యారు.

వన్యప్రాణుల బెడద, చీడపురుగుల బాధ

అడవి పందులు,కోతులు అడవిలో ఆహారం కొరత ఏర్పడి ,పంట పొలాల్లో వరి విత్తనలు,మొలకెత్తిన దశలోనే వన్యప్రాణులు నాశనం చేస్తూ తీవ్ర నష్టాన్ని కలిగించాయి.పల్లే ప్రాంతాల్లో అడవులు బలహీనపడుతున్న కొద్ది పంట పొలాల పైన వన్యప్రాణుల బెడద ఎక్కువ అవుతుంది.గత 5 ఆరు సంవత్సరాలుగా మండల కేంద్రంలోని అటవీ ప్రాంతాలు ఐనా వట్టిమల్ల,మరీమడ్ల, బావుసాయిపేట, మామిడిపల్లి,శివంగలపల్లి, వెంకట్రవుపేట, గ్రామాల్లో కోతులు,అడవి పందుల బెడద పెను సమస్యగా మారి నష్టం వాటిల్లింది.కాండం తొలుచు పురుగు వరి పంటమీద కనిపించే అతిముఖ్యమైన పురుగు. ఇది ఖరిఫ్ లోనూ రబీలో కూడా పంటను ఆశిస్తూ ఎక్కువగా నష్టాన్ని కలిగించే మొగిపురుగు.వేసవికాలం ప్రారంభ దశలో పడే చెడగొట్టు వానలతో వచ్చే పంట మొత్తాన్ని ఒక్కొక్క కాండాన్ని నుండి విత్తనం వరకు పిప్పిగా చేసి చివరగా తాలు మిగిలేలా చేసి పూర్తి నష్టాన్ని కలిగిస్తుంది.ఈ యాసంగీ పంటకు పూర్తిగా, దాదాపు 5 వేల ఎకరాలు సాగు పంట, మొగిపురుగుతో నష్టపోయి పంట అంత ఉసాతిరిగి భారీ నష్టం వాటిల్లింది.

భారీ వడగాళ్ళ,వర్షానికి నెలరాలిన వడ్లు

ప్రకృతి ప్రళయానికి, అస్తవ్యస్తమైన రైతన్న ,పట్టుమని పదినిమిషాలు కూడా కాలేదు మండల కేంద్రాన్ని అంత కుదిపేసింది.భారీ ఈదురు గాలులతో కూడిన రాళ్ల వర్ష పతం నమోదు ఐనది.ఆ ఈదురు గాల్లు పది నిమిషాల్లో జన జీవనం అంత అస్తవ్యస్తం చేసింది.మండల కేంద్రంలోని వట్టిమల్ల , బావుసాయిపేట, కమ్మారిపేట తండా,నిజామాబాద్,గొల్లపల్లి, కోనరావుపేట గ్రామాల్లో దాదాపు 8 వేల ఎకరాల వరకు పూర్తి స్థాయిలో వడ్లు నెల రాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. బావుసాయిపేటలో , వట్టిమల్లలో మామిడి చెట్లు దాదాపు 185 వరకు విరిగి మామిడి కాయలు పూర్తిగా నాశనం ఐయ్యాయి.గొల్లపల్లి,నిమ్మపళ్లి గ్రామాల్లో విద్యుత్తు స్థంబాలు ధ్వంసం కావడంతో విద్యుత్తు సరఫరా పూర్తిగా నిలిచిపోయి, గోవిందరావుపేట తండా,వట్టిమళ్ళలో స్థంబాలు, భారీ చెట్లు రోడ్డు పైన కూలిపోయి,రాకపోకలకు అంతరాయం కల్గింది.నిజామాబాద్, కమ్మారిపేట తండా ఇండ్లు కూలిపోయి నిర్వాసితులు ఆయ్యారు.సామాన్యుడి జీవితం అంతా అతలాకుతలం చేసింది.అన్నదాతకు చేతుకు వచ్చిన పంట మొత్తం నెలరాలిపోయి నిండా ముంచింది.

అడుగడుగున అధికారుల ,వైఫల్యాలు,ప్రభుత్వం నిర్లక్షం

అన్నదాత ఈ యసాంగి వరి పంటకు నమ్ముకొని, అడుగడుగునా తీవ్ర నష్టాలు వాటిల్లి కష్టాల్లో ఊబిలో కూరుకుపోయారు అనే చెప్పచ్చు.నకిలీ విత్తనాలు,ఎరువులను గుర్తించడంలో అధికారులు విఫలం కావడంతో అక్రమార్కుల చేతిలో పడి రైతన్న నష్టపోయాడు.కరెంట్ లేక నీటి కొరత ఏర్పడి ,పంటలు పూర్తిగా ఎండిపోయి నష్టం వాటిల్లిన,నష్టపరిహారం ఉసే లేదు. భారీ వడగళ్ల ,వర్షాలతో వడ్లు నెల రాలిపోయిన ,నష్టపోయిన రైతులకు గుర్తించి నష్టపరిహారం కల్పించడంలో అధికారులు వైఫల్యం ఏర్పడుతుంది,గత ఏడాది నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం రాకపోవడం పై అధికారుల వైఫల్యం,లేదా ప్రభుత్వం నిర్లక్షం హా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.వ్యవసాయ అధికారులు, ఏ పంట వేయాలో, రైతులకు సరైన అవగాహన కల్పించకపోవడం విలమయ్యారు.అన్నదాత నష్టానికి ప్రత్యేకంగా ప్రకృతి కారణం ఐతే పరోక్షంగా అధికారులు,ప్రభుత్వమే కారణం అనే చెప్పచ్చు.ఎది ఏమైనా అన్నదాతలు ,పంట కోల్పోయి నష్టపోయిన అర్హులైన వారికి నష్టపరిహారాన్ని కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.