Wednesday , July 24 2024

ఒకే రాత్రి నాలుగు ఆలయాలలో చోరీ

తెలంగాణ కెరటం మర్కుక్ మండల ప్రతినిధి జనవరి

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని గుర్తుతెలియని దుండగులు ఆలయాలలోకి చోరికి పాల్పడ్డారు. గ్రామంలోని శ్రీ మహంకాళి ఆలయం, పెద్దమ్మ తల్లి ఆలయం, శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం, ముత్యాలమ్మ ఆలయాలలో ఒకే రాత్రి నాలుగు చోట్ల చోరీ జరిగాయి. వరకు ఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి వరకు నాలుచోట్ల ఆలయాల ప్రాంగణంలో ఆలయం తలుపులు బద్దలు కొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారని అన్నారు. బుధవారం రోజు గ్రామ ప్రజలు గుడికి వెళ్లి చూడడంతో ఎస్ ఐ శంకర్ కు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు.వారు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆలయంలో గుడి తలుపులు పగలకొట్టి కొట్టి హుండీలో నీ డబ్బులు,వెండి తొట్టెల,దొంగలించారాని, శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి మెడలోని మంగళసూత్రం,ఉండిలోని డబ్బులు దొంగలించారాని, మహంకాళి ఆలయంలో హుండీలోని నగదును, సీసీ కెమెరాలుకు సంబంధించిన డివిఆర్ లను దొంగలించారని, ముత్యాలమ్మ ఆలయంలో చోరికి పాల్పడి ఎలాంటి వస్తువులు చోరీ కి గురవాలేదని తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.