Wednesday , July 24 2024

అక్రమ వడ్డీ వ్యాపారుల పై పోలీసుల కొరడా

వేములవాడలో అర్ధరాత్రి కొనసాగిన సోదాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి జూలై:-01

రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ పట్టణంలో వడ్డీ వ్యాపారులపై పోలీసులు
ఏకకాలంలో పోలీసుల మెరుపు దాడులు నిర్వహించారు
పలువురు వడ్డీ వ్యాపారుల ఇంట్లో సోదాలు రికార్డులను స్వాధీనం చేసుకొన్నారు మరో వడ్డీ వ్యాపారి తన కార్యాలయం లోని బీరువాలకు తాళాలు వేయడం తో అర్ధరాత్రి వరకు వేచి చూసి 6 గంటల ఉత్కంఠ తర్వాత వ్యాపారి బీరువాలు తెరువడం తో
రూ. 9.95లక్షల నగదుతో పాటు పలు కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వడ్డీ వ్యాపారులపై నిరంతరం దాడులు కొనసాగుతాయని, వ్యాపారుల వేధింపులకు గురైన వారు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పట్టణ సీఐ ఓ వెంకటేష్ తెలిపారు