తెలంగాణ కెరటం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి డిసెంబర్:-12
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడిఎస్ బియ్యం అక్రమ కొనుగోళ్లు జోరందుకున్నాయి పేదలు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో రూపాయికే కిలో చొప్పున ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ
రవాణా జోరుగా సాగుతున్నది. ప్రతినెలా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యాన్ని రేషన్ దుకాణం ముందే కొంత మంది దళారులు
స్థానిక కిరాణా షాపులవారు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి రైస్ మిల్లరకు విక్రయిస్తున్నారు.
కొందరు రేషన్ డీలర్లే లబ్ధిదారుల నుంచి బియ్యం తీసుకొని కిలో కు పది నుండి పదిహేను రూపాయలు చెల్లిస్తూ స్థానిక మిల్లు లకు తరలిస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా కేంద్రంలో చంద్రం పేట వద్ద గల రైస్ మిల్లులో పిడిఎస్ బియ్యం అక్రమ కొనుగోలు బహిరంగం గానే జరుగుతున్నాయి ఇటు వేములవాడ పట్టణంలో
కొనాయిపల్లి రోడ్డులో గల కన్యకా పరమేశ్వరి మిల్లులో యదేచ్చగా అక్రమ కొనుగోళ్ళు జరుపుతున్నారు ఇప్పటికైనా సివిల్ సప్లై అధికారులు స్పందించి పిడిఎస్ బియ్యం అక్రమ కొనుగోలు చేస్తున్న రైస్ మిల్లులపై తనిఖీ లు నిర్వహించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది