Saturday , October 12 2024

అక్రమ ఇసుక రవాణాకు అడ్డు అదుపు లేదు,‼️

అంతా తానే కర్ణాటక కు ఇసుకను పంపుతున్న మైనింగ్ ఆర్ ఐ,❓

తర్లుతున్న టిప్పర్లను పట్టుకున్న కృష్ణ పోలీసులు‼️కేసు నమోదు చేస్తారా వదిలేస్తారా‼️❓

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలం నుండి కర్ణాటక ప్రాంతానికి ఇసుక రవాణా యదేచ్చగా అక్రమంగా కొనసాగుతా ఉంది, వివరాల్లోకి వెళ్తే మాగనూరు మండలం కేంద్రంలో ఒక రీచ్ వర్కూర్ గ్రామంలో పలు రీచ్ ల నుంచి ఇసుక తరలించడం కొరకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, ఇది అదునుగా భావించిన రీచ్ యజమానులు మైనింగ్ ఆర్ ఐ రమేష్ తో కుమ్మక్కై కర్ణాటకకు అక్రమ మార్గంలో ఇసుకను రవాణా చేయాలని వక్రబుద్ధితో గత కొన్ని రోజులుగా కర్ణాటక సరిహద్దులో ఉన్న గ్రామాల పేరు మీద ఇసుక అనుమతి తో అనుమతి పొంది అక్కడి నుంచి కర్ణాటక ప్రాంతంలో నిర్మిస్తున్న ఇండస్ట్రియల్ కు పెద్ద ఎత్తున దాదాపుగా 5 టిప్పర్ల ఇసుక అవసరం ఉందని గుర్తించి జిల్లా అధికారి వారితో కుమ్మక్కై ఇక్కడి నుంచి యదేచ్చగా అక్రమ మార్గంలో ఇసుకను తరలిస్తున్నారు, గత వారం రోజుల క్రితం స్థానికంగా కొంతమంది వాహనాలను ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చినా కూడా వారు స్పందించలేదు మీడియాలో వచ్చినా కూడా జిల్లా కలెక్టర్ అధికారులు స్పందించలేదు అనే ఆరోపణలు ఉన్నాయి, అయితే నేడు కర్ణాటకకు తరలిస్తున్న ఇసుక టిప్పర్లను కొంతమంది యువకులు సరిహద్దు ప్రాంతంలో ఆపి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చాలా సమయం తర్వాత అక్కడికి చేరుకొని మూడు వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు, అదే సమయంలో కొంతమంది ఓ ప్రజా ప్రతినిధి ఆ పోలీస్ అధికారులకు ఫోన్లో సమాచారం ఇచ్చి స్టేషన్కు తరలించకుండా బయటనే ఆపి రాజీ కుదిరిచే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారంమరి అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను స్టేషన్లో ఉంచి కేసులు నమోదు చేస్తారా లేక వదిలేస్తారా అని ఆ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు,