Tuesday , July 16 2024

అక్రమ కేసులకు భయపడేది లేదు

వాస్తవాలు తెలుసుకొని వార్తలు రాయాలి

నిజమైన జర్నలిస్ట్ అని నిర్ధారణ చేసేది ఎవరు?

వాస్తవాలు తెలుసుకొని వార్తలు వార్తలు రాసి జర్నలిజం విలువలు కాపాడాలని జర్నలిస్ట్ సంఘాల నాయకులు కోరారు. మంగళవారం రోజు కామారెడ్డి జిల్లాలో ఓ మండల కేంద్రంలో అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్ యజమాని జర్నలిస్టులపై కేసులు నమోదు చేయించారు. దానిపైన నిజ నిజాలు తెలుసుకోకుండా కొందరు విలేకరులు వార్తలు రాసి జర్నలిజం విలువలని కాల రాస్తున్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను గ్రూపులలో పోస్ట్ చేసిన వారి పంపిన వార్తలు ప్రచురించకుండా విలేకరులనే దోషులుగా చూస్తూ వార్తలు రాశారు. కేంద్ర ప్రభుత్వం చే గుర్తింపు పొందిన ఆర్ఎన్ఐ సర్టిఫికెట్ కలిగిన వారు సంస్థలలోనే పనిచేస్తున్నారు. కానీ ఈ విషయంపై అవగాహన లేని కొందరు విలేకరులు నకిలీలు అంటూ వార్తలు రాసి జర్నలిజం విలువలని దిగజారుస్తున్నారు. తమ వ్యాపారాలను కాపాడుకోవడానికి జర్నలిస్టు ముసుగులో కొనసాగుతున్నారు .వారు కొందరు దళారులతో చేతులు కలిపి ఇట్టి వార్తలు రాయిస్తున్నారు అని తెలుస్తుంది. వ్యాపారాలు చేసే విలేకరులు జర్నలిస్టు ముసుగు ధరించి చాలా ఫ్యాక్టరీలలో ఖాతాలు పెట్టుకుని తాము నికార్సైన జర్నలిస్టులమని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజ నిజాలనే వార్తలుగా రాయాలని జర్నలిస్టు నాయకులు తెలియజేశారు.