Tuesday , July 16 2024

ఈనెల 12న జరిగే కరీంనగర్ కథనభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలి.

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి.

_పార్టీ కార్యకర్తలు నాయకులు సమన్వయంతో పని చేయాలి.

_కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్.

తెలంగాణ కెరటం అక్కన్నపేట్ ప్రతినిధి మార్చి 7

సిద్దిపేట జిల్లాఈనెల 12న బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ లో తలపెట్టిన కథనభేరి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని అందుకు ప్రతి కార్యకర్త నాయకుడు కృషి చేయవలసిన అవసరం ఉందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వోడితల సతీష్ బాబు పిలుపునిచ్చారు . హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని కరీంనగర్ గడ్డపైన గులాబీ జెండా ఎగరేయాలని అందుకు పార్టీ తరఫున బోయినపల్లి వినోద్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత హుస్నాబాద్ నియోజకవర్గంలో నుండి ప్రతి కార్యకర్త నాయకుడు కష్టపడి పని చేయాలని అన్నారు. కరీంనగర్ కథనభేరి సభకు నియోజకవర్గం నుండి లక్షలాదిగా పార్టీ కార్యకర్తలను తరలించాలని అందుకు అందరు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అక్కన్నపేట జడ్పిటిసి భూక్యమంగా , ఎంపీపీ మాలోతు లక్ష్మి,ఎంపీటీసీ ఎస్ఆర్ సాంబరాజు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.