Friday , November 15 2024

మెప్మా ఆర్ పి లను సన్మానించిన బిజెపిమహిళా మోర్చా.

తెలంగాణ కెరటం హుస్నాబాద్ ప్రతినిధి మార్చి 7

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం అంతర్జాతీయ మహిళదినోత్సవంను పురస్కరించుకొని ఈరోజు హుస్నాబాద్ పట్టణ బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో బిజెపి నియోజకవర్గ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమంఏర్పాటుచేసి హుస్నాబాద్ మున్సిపల్ మహిళపారిశుధ్య కార్మికులను మరియు పట్టణపేదరిక నిర్ములన సంస్థ (మెప్మా ) రిసోర్స్ పర్సన్ లను ఘనంగా సన్మానం చేయటం జరిగింది
ఈ సందర్బంగా బిజెపి రాష్ట్రకౌన్సిల్ సభ్యులు లక్కీరెడ్డి తిరుమల మాట్లాడుతు మహిళపారిశుధ్య కార్మికులసేవల వాళ్ళనే నేడు మనపట్టణము పరిశుభ్రముగా వుంది స్వచ్ఛపట్టణముగా జాతీయస్థాయిలో అవార్డులుపొందుతూన్నదని మరియు మెప్మా ఆర్ పి ల కృషివల్ల కేంద్రప్రభుత్వం కరోనా తరువాత పేదప్రజలను & చిరువ్యాపారులను ఆడుకోవటంకోసం ఏర్పాటుచేసిన స్ట్రీట్ వెండర్స్ స్కీమ్ ద్వారా పేదప్రజలు చాలామంది లాభంపొందినరాని అభినందనలుతెలిపారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణ బిజెపి అధ్యక్షులు &కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, కౌన్సిలర్ కోమటి స్వర్ణలత, అసెంబ్లీ కో కన్వీనర్ వేణుగోపాల్ రావు,బిజెపి మహిళమోర్చా జిల్లాప్రధానకార్యదర్శి తోట స్వరూప, శారదా,టౌన్ ప్రధానకార్యదర్శి తోట సమయ్య, పట్టణ ఉపాధ్యక్షలు లక్ష్మణ్, రాంప్రసాద్ బీజేవైఎం అధ్యక్షులు బీమేశ్వర్,అనంతస్వామి,ఆర్ పి లు, మహిళపరిశుద్ధ కార్మికులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.