Tuesday , July 16 2024

ఆగ్రామంలో..!గ్రామపంచాయతీ ఎక్కడ…!!

ఆ గ్రామంలో గ్రామపంచాయతీ ఎక్కడ…!!

ఆ గ్రామానికి వెళ్తే గ్రామపంచాయతీ ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిందే

మధ్యాహ్నం 12 గంటలు అయితే గ్రామపంచాయతీ సిబ్బంది ఉండరు

ఎప్పుడూ గ్రామంలో కనిపించని కార్యదర్శి

తండాలు గ్రామపంచాయతీలుగా మారిన తర్వాత అభివృద్ధి కుంటుపడింది

సమస్యల పుట్టగా మారిన గ్రామపంచాయతీ

గ్రామపంచాయతీలో సిబ్బంది ఉన్నారా… ఉంటే పరిశుభ్రత ఎక్కడ

తెలంగాణ కెరటం జిల్లా ప్రతినిధి మార్చ్ 31

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజా పరిపాలన ప్రజల వద్దకు సులభతరంగా చేరాలని ఒక ఉద్దేశంతో నూతన గ్రామపంచాయతీలు తెలంగాణ అభివృద్ధికి అవసరమని గ్రామ పంచాయతీలకు అనుసంధానంగా ఉన్న తండాలను నూతన గ్రామపంచాయతీలుగా మార్చడం జరిగింది ఇందులో భాగంగానే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామపంచాయతీ నుండి నూతన గ్రామపంచాయతీగా బట్టు తండా ఏర్పాటు చేయడం జరిగింది నూతన గ్రామపంచాయతీ బట్టు తండా ఏర్పాటు జరిగినప్పటి నుండి పంచాయతీ కార్యదర్శి గ్రామంలో ఉంటూ గ్రామ ప్రజల సమస్యల కోసం పనిచేయాల్సిన గ్రామ కార్యదర్శి మధ్యాహ్నం 12 గంటల సమయం అయ్యిందంటే గ్రామపంచాయతీకి తాళం వేసి ఎక్కడికి వెళ్తున్నాడు తెలియని వైనం గ్రామంలో పరిశుభ్రత పరిసరాల ప్రాంతాలను పరిశీలించకుండా గ్రామపంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నాడు అలాగే గ్రామపంచాయతీ నడవడానికి అవసరమైన కనీస సిబ్బంది నూతనంగా ఏర్పడినటువంటి గ్రామపంచాయతీలో లేకపోవడం గమనార్హం పంచాయతీ కార్యదర్శి ఏదైనా ఆఫీస్ పనుల మీద ఇతర శాఖలకు వెళితే గ్రామపంచాయతీ నడిపించడానికి అవసరమైన గ్రామపంచాయతీ కరోబార్ కూడా అందుబాటులో లేరు పారిశుద్ధ్య సిబ్బంది అసలు కనిపించడమే లేదు
అధికారులు ఇలా నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామపంచాయతీ పాలకవర్గ కూడా పట్టించుకోకపోవడం వలన గ్రామం అభివృద్ధికి నోచుకోవడం లేదు ఇలా గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు పాలకవర్గం వ్యవహరిస్తున్న పై అధికారుల పర్యవేక్షణ కరువైందా..


ఇలా నిర్లక్ష్యం వహిస్తున్న బట్టు తండా కార్యదర్శి సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యుల పైన పై అధికారులు ఏ విధంగా స్పందిస్తారు వేచి చూడాల్సిందే..


ఏదైనా సమాచారం కోసం గ్రామపంచాయతీ కార్యదర్శి కాల్ చేస్తే స్పందించకుండా చాలా రోజుల నుండి నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నారు బట్టు తండా గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు…అని ఎదురుచూస్తున్నారు