రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ కెరటం ప్రతినిధి జూన్:-22
రాజన్న సిరిసిల్ల జిల్లా
కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలోని ఎల్లమ్మ ఆలయ సమీపంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని ఈత,తాటి వనం దగ్ధం అయ్యింది సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక
సిబ్బంది ఫైర్ ఇంజన్ మంటలను ఆర్పే ప్రయత్నంచేస్తున్న సమయం
మధ్యలోనే ఫైర్ ఇంజన్లో నీళ్లు ఖాళీ కావడంతో తాత్కాలికంగా బోరు మోటర్ల ద్వారా ఫైర్ ఇంజన్ లో నీళ్లను నింపే ప్రయత్నం చేశారు విషయం తెలుసుకున్న వేములవాడ డి.ఎస్.పి నాగేంద్ర చారి సంఘటన స్థలాన్ని పరిశీలించి ఫైర్ ఇంజన్ సిబ్బందితో మంటలను ఆర్పే ప్రయత్నాన్ని దగ్గర ఉండి పరిశీలించారు .
ఈత తాటి వనం దగ్ధం అవ్వడం తో జీవనోపాధి కోల్పోయమని ప్రభుత్వ పరంగా తమను ఆదుకోవాలని గీతా కార్మికులు వాపోయారు