Wednesday , September 18 2024

వైన్స్లను తలపిస్తున్న బెల్ట్ షాపులు

  • సమాచారం చేరవేసిన పట్టించుకోని ఎక్సైజ్ శాఖ సిఐ

  • అందరికీ తెలుసంటు చేతులు దులుకుంటున్న సీఐ

  • వైన్స్లమద్యం టార్గెట్ పూర్తి చేయాడనికి పరిగెడుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు

  • మద్యానికి బానిసవుతున్న యువకులు, పేద కుటుంబాలు

  • ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మద్యం మత్తులోనే

  • గాఢ నిద్రలో ఎక్సైజ్ విజిలెన్స్ అధికారులు

  • బెల్ట్ షాపుల కట్టడిపై చర్యలు శూన్యం
  • అప్పుల్లో కూరుకు పోతున్నాం అంటున్న మహిళలు
  • ఇప్పటికైనా మద్యం శాఖ మొద్దు నిద్ర వదులుతుందా ?

తెలంగాణ కెరటం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బ్యూరో జూలై 30

కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలలో బెల్ట్ దుకాణాలు మండల, పట్టణాల కేంద్రాలలో ఉన్నటువంటి వైన్ షాపులను తలపిస్తున్నాయి.
దోమకొండ ఎక్సైజ్ శాఖ పరిధిలో

పలు గ్రామాలలో విచ్చలవిడిగా మద్యం


అమ్మకాలు కొనసాగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు, ఎక్సైజ్ విజిలెన్స్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయని తద్వారా ప్రజలు నష్టపోతున్నారని తెలిసిన పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలలోని ప్రజలు రోజంతా కాయకష్టం చేసుకుని వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న తరుణంలో గ్రామాల్లో బెల్ట్ షాపులు ప్రవేశించి వారి కుటుంబాలలో చిచ్చు పెడుతున్నాయి. కుటుంబంలోని పురుషులు గ్రామంలోనే మద్యం లభించడంతో మద్యానికి బానిసై రోజంతా పని చేయగా వచ్చిన కూలి డబ్బులను మద్యానికి ఖర్చు చేయడంతో కొన్ని కుటుంబాలు రాత్రి పూట పస్తులు వుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బిబిపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో సుమారు రెండు నెలల క్రితం యువకుడు మద్యానికి బానిసై మద్యం తాగడానికి డబ్బులు లేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి వచ్చిన వారి పంతాను మార్చుకోకపోవడం గమనార్హం. ఎక్సైజ్ శాఖ అధికారులు బీద మధ్యతరగతి ప్రజల ధనప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మేధావి వర్గం పేర్కొంటుంది. ఎక్సైజ్ విజిలెన్స్ అధికారులు ఎక్కడ ఉన్నారో అని గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు.

బెల్ట్ దుకాణాల కట్టడి ఎక్కడ ?

గ్రామాలలో బెల్ట్ షాప్ ల ద్వారా అనాధికారికంగా మద్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ తెలిసిన ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఎక్సైజ్ శాఖ మద్యం టార్గెట్ నింపుకోవడానికి వైన్ షాపులను ప్రోత్సహిస్తూ అందులో భాగంగానే గ్రామాల్లో బెల్ట్ దుకాణాలను నిర్వహిస్తున్నరని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొసమెరుపు……
ఆదాయ వనరులు పెంచుకోవడానికి ప్రజల ధన ప్రాణలతో చెలగాటం ఆడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం.

ఫోటో రైటప్ 1 ; జంగంపల్లి గ్రామంలో మద్యం విక్రయిస్తున్న దృశ్యం
ఫోటో రైటప్ 2; దోమకొండ ఎక్స్ప్రెస్ శాఖ కార్యాలయం