Thursday , May 23 2024

ఏసీబీకి చిక్కిన మమాడ ఎస్సై

తెలంగాణ కెరటం స్టేట్ క్రైమ్ 29

మమాడ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఆదివారం రోజున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.రూపాయలు 10000 లంచం తీసుకుంటుండగా ఎస్సై రాజును రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపేట గ్రామానికి చెందిన సల్కం సతీష్ ఇతర వ్యక్తితో ఇటీవల గొడవ పడడంతో ఎస్సై రాజు అతనిపై 323, 341, 291 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో రిమాండ్ చేస్తానంటూ బాధితుడికి ఎస్సై చెప్పడంతో రూపాయలు 10000 ఇస్తే స్టేషన్ బెల్ మంజూరు చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు . ఆదివారం ఇట్టి విషయాన్ని ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై రాజుకు, సతీష్ 10,000 ఇస్తుండగా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు