Tuesday , July 16 2024

జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతాం..??

తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో

జర్నలిస్టుల సమస్యల కోసం పోరాడుతాం

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల నెలకొన్న సమస్యల కోసం కార్యాచరణ ఏర్పాటు దిశగా అఖిలభారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు రాజేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జాతీయఅధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ సంఘంలోకి తెలంగాణ కెరటం తెలుగు దినపత్రిక ఎడిటర్ కుక్కల రాజు మరియు చార్మినార్ ఎక్స్ ప్రెస్ దినపత్రిక ఎడిటర్ దాసరి నాగరాజు , సింగిడి ఛానల్ చైర్మన్ నరేష్ మరియు కామారెడ్డి జిల్లాకు చెందిన జర్నలిస్టులు నీల వెంకట్, చేరడం జరిగింది రాబోవు రోజుల్లో దాదాపుగా 40 మంది కామారెడ్డి చెందిన జర్నలిస్టులు అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ లో చేరనున్నారు అని అన్నారు కార్యక్రమంలో అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజలింగం మరియు గంగాధర్ రావు హైదరాబాద్ కు చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు