Tuesday , July 16 2024

అభివృద్ధి చేస్తా ఆశీర్వదించండి

హుస్నాబాద్ లో కమలం పువ్వును గెలిపించండిహుస్నాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి

తెలంగాణ కెరటం చిగురుమామిడి మండల ప్రతినిధి నవంబర్:-22అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హుస్నాబాద్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని బొమ్మ వెంకన్న ఆశయ సాధన కోసం నేను కృషి చేస్తానని నన్ను ఆశీర్వదించి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించాడు చిగురు మామిడి మండలంలోని ఇందుర్తి, ఓగులాపూర్, ముల్కనూర్, పీచుపల్లి, సీతారాంపూర్, లంబాడి పల్లి గ్రామాలలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు అవకాశం ఇచ్చారు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశం ఇచ్చారు ఈసారి బిజెపి పార్టీకి అవకాశం ఇవ్వండని ప్రజలను కోరారు బిఆర్ఎస్ ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నదని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు చూశారు గనుక బిజెపి పార్టీకి అవకాశం ఇచ్చి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించాడు దేశంలో బిజెపి ప్రభుత్వం 20 రాష్ట్రాల్లో పని చేస్తుందని కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో బిజెపి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నదని అందుకే కేంద్రంలో బిజెపి తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని గెలిపించినట్లయితే మన రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తున్నదని హుస్నాబాద్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులు పండించిన పంటలకు మూడు వేల ఒక వంద గిట్టుబాటు ధర కల్పిస్తామని అలాగే ఆడపిల్ల జన్మిస్తే రెండు లక్షల రూపాయలు జమ చేస్తామని వెల్లడించారు గ్రామాలలో కొన్ని కుటుంబాలలో మద్యపానం వల్ల గొడవలు జరుగుతున్నావని గ్రామాలలో జోరుగా బెల్ట్ షాపులు

కొనసాగుతున్నాయని దీనివల్ల యువకులు అనేకమంది చనిపోతున్నారని బిజెపి అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను రద్దు చేస్తామని పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాల కోసం మా తండ్రిగారు పనిచేశారని మద్యం మాఫియా ఇసుక మాఫియా భూదందా లు విచ్చలవిడిగా జరుగుతున్నవని వాటికి నేను వ్యతిరేకినని పేర్కొన్నారు ఇందుర్తి గ్రామం ఎంతో అభివృద్ధి చెందవలసిన గ్రామమని అసెంబ్లీ నియోజకవర్గంగా పేర్కొన్న ఈ ఇందుర్తి అభివృద్ధిలో వెనక పడటం చాలా బాధాకరమని అనేక గ్రామాల్లో నేటికీ మట్టి రోడ్లు దర్శనమిస్తున్నాయని అనేక గ్రామాలు నేటికీ అభివృద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు నన్ను గెలిపిస్తే గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసుకుందామని రానున్న రోజులలోప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని ఈనెల 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్ని కల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బిజెపి మండల ప్రధాన కార్యదర్శిపైడిపల్లి శ్రీనివాస్, భగవాన్ రెడ్డి, ముదిమాణిక్యం ఎంపిటిసి అచ్చ రవీందర్, బిజెపి నాయకులు, వంగర మల్లేశం, పోలోజు సంతోష్, గార్ల దాసు, సతీష్, బూదార్తి మహేందర్, చెప్పాల మురళీకృష్ణ, కూన సంతోష్, కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ముంజ చంద్రయ్య, పెందోట రఘునాథ్, వివిధ గ్రామాల బిజెపి జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు